అది చూసి పెళ్లి అంటే ఎలా?

Update: 2018-04-30 17:10 GMT
బాలీవుడ్ కం హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు దేశదేశాలు చక్కర్లు కొట్టేస్తోంది. అడపాదడపా ఇండియా వస్తోంది కానీ.. ఇక్కడ మకాం వేస్తున్న సందర్భాలు.. రోజులు తక్కువే. ఏవో బ్రాండ్ అండార్స్ మెంట్స్  కోసం మినహాయిస్తే.. ఇండియాలో కనిపించడమే లేదు ఈ బ్యూటీ.

తల్లితో సహా అమెరికా షిఫ్ట్ అయిపోయిన తర్వాత.. ప్రియాంక చోప్రా చాలా రేర్ గా ఇండియా వస్తోంది. ఈ మధ్య కాలంలో అసోంకు ప్రచారకర్తగా ఎంపికయినపుడు మాత్రం కొన్ని రోజులు సందడి చేసింది. అయితే.. గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా మీద ఓ రూమర్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అమ్మడు అమెరికాలో ఎవరినో సీక్రెట్ గా మ్యారేజ్ చేసేసుకుందని.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టేసిందన్నది వాటి సారాంశం. వీటన్నిటికీ మూలం ఏంటంటే.. అమ్మడి చేతికి ఉన్న ఓ బ్రేస్ లెట్. అయినా.. కాలి వేళ్లకు మెట్టెలు కనిపించినా.. మెడలో నల్లపూసలు కానీ.. మంగళసూత్రం కానీ కనిపించినా పెళ్లయిందేమో అనుకుంటారు కానీ.. బ్రేస్ లెట్ తో పెళ్లి అని ఎలా ఫిక్స్ అవుతారనే అనుమానం సహజం,

ఈ బ్రేస్ లెట్ అచ్చు గుద్దినట్లుగా మంగళసూత్రం మాదిరిగానే ఉంది మరి. దానిపైనే తెగ చర్చలు నడిచిపోతుంటే.. ఈ విషంపై పీసీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసింది. తాను కేవలం దిష్టి కోసం పెట్టుకున్న ఓ పూస మాత్రమే ఇది అని తేల్చేసిన పిగ్గీ ఛాప్స్.. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం అందరికీ తప్పకుండా చెబుతానని అంటోంది.
Tags:    

Similar News