అస్తమా ఉందని ఒప్పుకున్న స్టార్ హీరోయిన్!

Update: 2018-09-19 07:51 GMT
ఎంటో కొన్ని పదాలు ఇంగ్లీష్ లో వింటే అందగా అనిపిస్తాయి.  ఉదాహరణకు కిల్లర్ జీన్స్. తెలుగులో హంతకుడు జీన్స్ అనాలి. బఫెలో జీన్స్.. తెలుగులో బర్రె లేదా గేదె లేదా ఎనుము జీన్స్ అనాలి. ఇక అస్తమా జబ్బు.  తెలుగులో ఉబ్బసం అనాలి. అలా ఉంటుంటే మన కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి 'గబ్బు***' అని తిట్టినట్టుగా ఉంది కదా.  అయినా ఆస్తమా అంటే అదేందో లైట్ గా ఉన్నట్టు గా ఉబ్బసం అంటే భయంకర వ్యాధిగా అనిపిస్తుంది!

సరే ఉబ్బసం టాపిక్ ఎలాగూ వచ్చింది కాబట్టి గ్లోబల్ సుందరి గురించి మాట్లాడుకుందాం.  ఈ ఇంటర్నేషనల్  స్టార్ హీరోయిన్  ప్రియాంక చోప్రా తనకు అస్తమా ఉందని రీసెంట్ గా తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నవారికి టాబ్లెట్స్ కంటే ఇన్ హేలర్ వాడడం మంచిదని తెలుపుతూ 'ది బ్రీథ్ ఫ్రీ' అనే కాంపెయిన్ జరుగుతోంది.  అస్తమా తో ఇబ్బందిపడే వాళ్ళకు ధైర్యాన్నిస్తూ వారు అందరిలాగా తమ పనులు చేసుకోవచ్చని అందుకోసం ఇన్ హేలర్ లు వాడాలని ప్రచారం చేస్తున్నారు.  ఈ కాంపెయిన్ కు ప్రియాంక తన మద్దతు ప్రకటించింది.  

ట్విట్టర్ ద్వారా "నాకు సన్నిహితంగా ఉండేవారందరికీ నేను ఆస్తమా పేషెంట్ అని తెలుసు.  అందులో దాచేందుకు ఏముంది? అస్తమా నన్ను కంట్రోల్ చేసే లోపు నేను దాన్ని కంట్రోల్ చెయ్యాలనే విషయం నాకు తెలుసు..  నా దగ్గర ఇన్ హేలర్ ఉన్నంతవరకూ నా గోల్స్ సాధించడంలో నాకు నచ్చిన విధంగా జీవించడంలో ఆస్తమానన్ను అసలు ఆపలేదు" అని ట్వీట్ చేసింది.  దాంతో పాటు అస్తమా విషయంలో తన స్టొరీని కూడా ట్విట్టర్ లింక్ ద్వారా షేర్ చేసింది.
Tags:    

Similar News