హీరో బ్ర‌ద‌ర్ తో తెలుగ‌మ్మాయ్

Update: 2018-12-30 01:30 GMT
న‌టించిన తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ల‌క్కీ గాళ్ గా పాపుల‌రైంది... తెలుగ‌మ్మాయికి ఆయాచితంగా ల‌క్ చిక్కింద‌న్నారు. ప్ర‌తిభ విష‌యంలో మాత్రం క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇంత‌కీ ఎవ‌రీ అమ్మాయి? అంటే రాయ‌ల‌సీమ గాళ్ ప్రియాంక జువాల్క‌ర్. ఈ భామ ఆరంగేట్ర‌మే రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. టాక్సీవాలా విజ‌యంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మ‌రో ఛాన్స్ ద‌క్కించుకుంది.

ఈసారి జూనియ‌ర్ బెల్లంకొండ హీరో. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ త‌మ్ముడు బెల్లంకొండ గ‌ణేష్ డెబ్యూ సినిమాలో క‌థానాయిక‌గా ఎంపికైంది. బెల్లంకొండ సురేష్ లాంటి ప్రెస్టేజియ‌స్ నిర్మాత పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారంటే అదృష్ట‌మ‌నే చెప్పాలి. గ‌ణేష్ న‌టించ‌నున్న తొలి చిత్రానికి వి.వి.వినాయ‌క్ శిష్యుడు ఫ‌ణి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం(ప‌రిచ‌యం) వ‌హిస్తున్నారు.

ఒక పెద్ద బ్యాన‌ర్‌ లో ప్రియాంక‌కు రెండో ఛాన్స్ ద‌క్కింది. అలాగే డెబ్యూ ద‌ర్శ‌కుడికి ఇది ల‌క్కీ ఛాన్స్. ఇక అన్న‌లాగే గ‌ణేష్ ట్యాలెంటెడ్ అని నిరూపించుకోవాలి. దానికి తోడు ఎవ‌రికో గానీ ద‌క్క‌ని అదృష్టం త‌న‌కు క‌లిసి వ‌చ్చ విజ‌యాలు ద‌క్కాలి. ఈ సినిమా డెబ్యూల ఫేట్ ని నిర్ణ‌యిస్తుంది.  ప్రియాంక కెరీర్ కి ట‌ర్నింగ్ పాయింట్ కానుంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎలా మెప్పు పొందనుందో చూడాలి.

    

Tags:    

Similar News