ప్రియాంక జవాల్కర్ 'టాక్సీవాలా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో కొంతకాలం పాటు ఇక్కడ ఈ అమ్మాయి హవా కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు.
తమన్నా తరహా మేనిఛాయతో మెరిసిపోయే ఈ అమ్మాయిని అభిమానించే కుర్రాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఎందుకనో ఆ తరువాత చేసిన సినిమాలు ఆమెకి అంతగా కలిసి రాలేదు. ఈ మధ్య వచ్చిన 'తిమ్మరుసు' .. 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమాలు ఆమెకి నిరాశనే మిగిల్చాయి.
ఇక ఆమె తాజా చిత్రమైన 'గమనం' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ - కల్కి ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు. శ్రియ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, శివకందుకూరి, ప్రియాంక జవాల్కర్ జంటగా కనిపించనున్నారు.
చారుహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూ లో ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాను గురించి మాట్లాడింది.
'గమనం' కథ వినగానే నాకు 'వేదం' సినిమా గుర్తుకు వచ్చింది. కథాకథనాల పరంగా ఎలాంటి పోలిక లేకపోయినా, ఆ తరహా ఎమోషన్ ఉంది. లేడీ డైరెక్టర్ సంజనారావు కథ చెప్పిన విధానం వలన, వెంటనే కనెక్ట్ అయ్యాను.
ఈ సినిమాలో నేను 'జారా' అనే ముస్లిమ్ యువతి పాత్రలో కనిపిస్తాను. కథ ప్రకారం చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్న ముఖ్యమైన పాత్రలలో నా పాత్ర ఒకటి. నా పాత్ర చాలా కీలకమైనదే అయినా, డైలాగ్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. కళ్లతోనే హావభావాలను పలికించే పాత్ర. నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది.
ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో చారుహాసన్ కనిపిస్తారు. ఆయనతో కలిసి నేను ఒక రెయిన్ సీక్వెన్స్ లో నటించవలసి వచ్చింది. ఆయన చాలా సీనియర్ .. నేను ఏమైనా ఎక్కువ టేకులు తీసుకుంటానేమో .. ఆయన చిరాకు పడతారేమోనని చాలా భయపడిపోయాను. ధైర్యం చేసుకుని ఆ సీన్ చేశాను .. ఓకే అనగానే హమ్మయ్య అనుకున్నాను.
ఇకపై బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని అనుకుంటున్నాను. కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ చేయడానికి అభ్యంతరం లేదు" అని చెప్పుకొచ్చింది. అందాలు ఆరబోయడానికి అభ్యంతరం లేదని చెప్పింది కనుక, ఇక అవకాశాలు ఏలా ఉంటాయనేది చూడాలి మరి.