గత కొన్ని రోజులుగా గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గురించిన వార్తలు మీడియాలో వస్తున్న విషయం తెల్సిందే. నాని ఈ చిత్రంను చేయబోతున్నాడని, నాగచైతన్య కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా ఉన్నాడంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే చివరకు ఈ ప్రాజెక్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వచ్చి ఆగింది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేం వంశీ కృష్ణ రెడీ చేసిన స్క్రిప్ట్ కు బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి మార్పులు చెప్పకుండా ఓకే చెప్పాడని, అనీల్ సుంకర బ్యానర్ లో త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేతులు మారింది.
ప్రస్తుతం అనీల్ సుంకర రెండు మూడు ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నాడు. ఇలాంటి సమయంలో బెల్లంకొండ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు ఆసక్తిగా లేడని, దాంతో దర్శకుడు వంశీకృష్ణ ఇదే స్క్రిప్ట్ ను అభిషేక్ అగర్వాల్ అనే నిర్మాత వద్దకు తీసుకు వెళ్లాడట. ఆయన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించేందుకు ఓకే చెప్పాడట. ప్రస్తుతం బెల్లంకొండ చేస్తున్న 'సీత' మూవీ అయిన తర్వాత 'రాక్షసన్' రీమేక్ చేయబోతున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు రాక్షసన్ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది చివర్లో బెల్లంకొండ స్టూవర్ట్ పురం రాబిన్ హుడ్ టైగర్ నాగేశ్వరరావుగా మారబోతున్నాడు.
కొన్నాళ్ల క్రితం టైగర్ నాగేశ్వరరావు దొంగతనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలీసులకు పెద్ద సవాల్ గా ఆయన నిలిచాడు. అలాంటి నాగేశ్వరరావు కథ సినిమాటిక్ గా ఉండటం వల్ల చాలా మంది ఆయన కథతో సినిమా తీయాలని భావించారు. అది వంశీ కృష్ణ కథ రూపం తీసుకు వచ్చి బెల్లంకొండతో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే ఏడాది ఈ బయోపిక్ వచ్చే అవకాశం ఉంది.