మొదట డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారిన బిల్ రాజు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 19 ఏళ్లు పూర్తయింది. ఇక నేడు ఆయన పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. 1970లో జన్మించిన దిల్ రాజు నేడు 52 వసంతంలోకి అడుగుపెట్టాడు. దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సక్సెస్ రేటు ఉన్న నిర్మాత అని చెప్పవచ్చు.
ఇక ఆయన ఇండస్ట్రీలో ఎక్కువగా కొత్త దర్శకులతోనే భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నుంచి పరిచయమైన దర్శకులు కూడా కొంతమంది ఇప్పుడు బడా సినిమాలు తీస్తున్నారు. 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ను స్టార్ట్ చేసిన రాజు గారి పేరు ఆ తర్వాత దిల్ రాజు అయిపోయింది.
ఇక 2004లో ఆర్య సినిమాతో మరో రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. అది సుకుమార్ కు మొదటి సినిమా. ఇక తర్వాత బోయపాటి శ్రీనుని కూడా భద్ర సినిమా ద్వారా దిల్ రాజు పరిచయం చేసారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక 2006లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతోనే భాస్కర్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఇక 2007లో మున్నా సినిమా ద్వారా వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ తర్వాత వీరి కలయికలో బృందావనం మహర్షి సినిమాలు కూడా వచ్చాయి ఇప్పుడు వారసుడు సినిమా రాబోతోంది. ఇక కొత్త బంగారులోకం సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాలను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలాగే జోష్ సినిమా ద్వారా వాసు వర్మ, ఓ ఫ్రెండ్ సినిమా ద్వారా వేణు శ్రీరామ్.. అలాగే మరికొంతమంది కొత్త దర్శకులు కూడా ఇండస్ట్రీకి దిల్ రాజు అండతోనే ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం మాత్రం రాజుగారు కొత్త దర్శకులతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోవడం లేదు. ఆయన కాంబినేషన్స్ ను నమ్మి భారీ బడ్జెట్ సినిమాలను తీసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.