ప్లాపులు తీసినా దొర‌గారే ఆ నిర్మాత‌

Update: 2019-12-07 05:50 GMT
నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `సాహ‌సం శ్వాస‌గా సాగిపో` చిత్రంతో బిజినెస్ మేన్ మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా పాపుల‌ర‌య్యారు. గౌత‌మ్ మీన‌న్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే ఆ సినిమా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. నిర్మాత‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. ఆ త‌ర్వాత కూడా బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా `జ‌య జాన‌కి నాయ‌క` చిత్రాన్ని మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫ‌లితం తెలిసిందే.

అయితే వ‌రుస ఫ్లాపులు వ‌చ్చాక ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డం అంటే ఆషామాషీ కానే కాదు. ఇండ‌స్ట్రీలో నెగెటివ్ శ‌క్తులు ప‌నైపోయింద‌నే ప్ర‌చారం సాగించాయి. అయితే ఇంత‌లోనే ఊహించ‌ని విధంగా ఆయ‌న న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ లాంటి మాస్ హీరోతో భారీ బ‌డ్జెట్ సినిమాని ప్రారంభించారు. రెండు ఫ్లాప్ సినిమాలు తీసిన మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి ఇప్పుడు అగ్ర హీరోతో ప‌ని చేస్తుండ‌డం ప‌రిశ్ర‌మ‌ లో వాడి వేడిగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

బాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో ఎన్బీకే 106 మూవీకి దాదాపు 40-50 కోట్ల మేర బ‌డ్జెట్ పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాత‌గా కంబ్యాక్ అయ్యేందుకు ఆయ‌న చాలానే రిస్క్ చేయ‌బోతున్నార‌ట‌. బాల‌య్య‌ కోసం మిరియాల ఏడాది కాలంగా వెయిటింగ్. ఎట్ట‌కేల‌కు బోలెడంత డైల‌మా న‌డుమ‌ ఆయ‌న స‌హ‌నం ఫ‌లించి ఇప్ప‌టికి సినిమా ప్రారంభ‌మైంది. ఎట్ట‌కేల‌కు బాల‌య్య‌ ను  స్క్రిప్టు తో ఒప్పించి బోయ‌పాటి అన్నిర‌కాల సస్పెన్స్ కి తెర దించారు. ఈ శుక్ర‌వారం(డిసెంబ‌ర్ 6) సినిమా మొద‌లైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ కు వెళ్ల‌నున్నారు. సంఘంలోని ప‌లు బ‌ర్నింగ్ అంశాల చుట్టూ ఈ సినిమా క‌థాంశం ఉంటుంద‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News