దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన క్రేజీ మూవీ ట్రిపుల్ ఆర్ ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలైంది. ప్రీమియర్స్ తో సంచలనం సృష్టించిన ట్రిపుల్ ఆర్ 3 మిలియన్ క్రాస్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. గత కొంత కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ప్రిమియర్ నుంచే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అనే యునానిమస్ టాక్ ని సొంతం చేసుకుంది.
దాదాపు ముడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా థియేటర్లలోకి ఎట్టకేలకు వచ్చేయడంతో థియేటర్ల వద్ద అభిమానుల జాతర మొదలైంది. కొన్ని చోట్ల అభిమానులు వివాదాస్పదంగా వ్యవహరిస్తే మరి కొన్ని చోట్ల థియేటర్లని ధ్వంసం చేశారు. మరి కొన్ని చోట్ల రామ్ చరణ్ - ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం చెలరేగడంతో టికెట్ లు చించేసి నానా రచ్చ చేశారు.
ఇక ఈ మూవీ ని తొలి షో చూసిన సెలబ్రిటీలు అద్భుతం చూశామని, రాజమౌళి ఇద్దరు హీరోలతో అద్భుతం చేశారని ప్రశంసల వర్షం కురిపిస్తే బాలీవుడ్ కు చెందిన క్రిటిక్ రాజమౌళిపై, సినిమాపై విషం చిమ్మే ప్రయత్నం చేశాడు. ఇక మరో క్రిటిక్ ఇది రాజమౌళికే సాధ్యమని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదిలా వుంటే ఈ మూవీపై నిర్మాత, వైఎస్సార్సీపీ నేత, వ్యాపార వేత్త ప్రసాద్ వి. పొట్లూరి ప్రశంసల వర్షం కురిపిస్తూనే విమర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రిపుల్ ఆర్ పై నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారిపై మండిపడ్డారు. జీవితంలో ఒక్క షాట్ తియ్యలేదు..షూటింగ్ లో నిలబడింది లేదు. కానీ సినిమాలు తీయడంలో క్లాసులు పీకుతారు. కళకు కులం పిచ్చి అంటించే కొడుకుల కుత్తుక కొయ్యాలి. జాతి గర్వించే కథలు..దేశ భక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి. మన తెలుగు వాడు జాతీయ సంపద అయినందుకు మన వాడని ఆనందపడాలి` అని సంచన ట్వీట్ చేశారు.