ఎన్నెన్నో అనుకుంటాం అవుతాయా? అని బాలయ్య డైలాగ్ అన్నట్టు నైజాం డిస్ట్రిబ్యూషన్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ ఏరియాలో భారీ సినిమా రిలీజ్ చేయాలంటే దిల్ రాజు మాత్రమే రిలీజ్ చేయాలి అనేలా వుండేది. నైజాంపై గత కొంత కాలంగా ఆయనదే ఆధిపత్యం. రెండో వ్యక్తికి ఇక్కడి చోటు లేదు. అయితే ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేయాలని గత రెండేళ్లుగా వరంగల్ శ్రీను శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు కానీ విధి సహకరించడం లేదు.
దిల్ రాజు పట్టిందల్లా బంగారం అయితే.. వరంగల్ శ్రీను పట్టిందల్లా ఫ్లాప్.. డిజాస్టర్ అవుతూ షాకుల మీద షాకులిస్తోంది. ఇదే ఇప్పడు వరంగల్ శ్రీనుకు శాపంగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుది తిరుగులేని రికార్డ్. ఆయన ఏ సినిమా తీసుకున్నా బాక్సాఫీస్ వద్ద రెట్టింపు లాభాల్ని తెచ్చిపెట్టింది. దీంతో నైజాంలో దిల్ రాజుదే హవాగా సాగింది. అయితే ఆ హవాకు చెక్ పెట్టాలని వచ్చిన కొత్త డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. దిల్ రాజు ఏ పెద్ద సినిమా వెంటపడితే ఆ సినిమాకు పోటీగా వెళుతూ భారీ ఆఫర్లు ఇస్తూ వరంగల్ శ్రీను నైజాం హక్కుల్ని దక్కించుకుంటే వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.
`ఆచార్య` సినిమా విషయంలోనూ మొండిగా వెళ్లి భారీ నష్టాలని ఎదుర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ ఆ మధ్య విడుదలై ఏ స్థాయి నష్టాలని తెచ్చిపెట్టిందో అందరికి తెలిసిందే. పోటీకి వెళ్లి ఫ్యాన్సీ రేటుకు నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కుల్నిదక్కించుకుంటే సినిమా డిజాస్టర్ కావడంతో అందులో ఒకటవ వంతు మాత్రమే తిరిరిరావడం తెలిసిందే. ఇప్పటికే ఆ నష్టాల నుంచి బయటపడని వరంగల్ శ్రీను తాజాగా విజయ్ దేవరకొండ `లైగర్`పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
నైజాం హక్కుల్ని భారీ మొత్తానికి దక్కించుని ఇండస్ట్రీ వర్గాలకు షాకిచ్చాడు. ఇంత పెట్టాడు రిటర్న్ పరిస్థితి ఏంటనే కామెంట్ లు `లైగర్` రిలీజ్ కు ముందే వినిపించినా సినిమాపై వున్న నమ్మకంతో వున్నాడు. కానీ ఫలితం డిజాస్టర్ అని తేలడంతో ప్రస్తుతం సతమతమవుతున్నాడట. హతవిధీ ఏదో అనుకుంటో ఏదో అవుతోంది డామిట్ కథ అడ్డం తిరిగింది? అని చెప్పుకుంటున్నారట.