ఇకపై 'రికార్డ్ కలెక్షన్స్' గోల లేనట్లేనా...?

Update: 2020-06-18 11:30 GMT
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్స్ విషయంలో కొన్ని గైడ్ లైన్స్ తో ముందుకు వెళ్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక సీటింగ్ విషయంలో కూడా మార్పులు జరగనున్నాయి. అంతేకాకుండా సినిమా బడ్జెట్ విషయంలో కూడా మేకర్స్ ఆలోచిస్తారు. ఇక ఆ హీరో ముందు సినిమా ఇంత చేసింది.. అంత చేసిందనే మార్కెట్ లెక్క‌లు చెప్పక పోవచ్చు. ఇప్పటి దాకా వంద కోట్లు రికార్డ్ క‌లెక్ష‌న్స్ ఉన్నవారు కూడా ఇక సున్నా నుంచి స్టార్ట్ అవ్వాల్సిందేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అంతేకాకుండా స్టార్ట్స్ తో సినిమాలు చేసిన ఏ నిర్మాత కూడా సొంత‌గా సినిమాను రిలీజ్ చేయ‌డానికి సాహ‌సించ‌రు. ఎందుకంటే ఒకవేళ సినిమా హిట్ అయితే సరే. లేకపోతే రిట‌ర్న్స్ రాబ‌ట్టుకోవాలంటే నిర్మాత‌కు చుక్క‌లు క‌నిపిస్తాయి. సో నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకోవడం కంటే అమ్మ‌డానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే డిస్ట్రీబ్యూట‌ర్లు ముందు ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు ఉండే అవ‌కాశం లేకపోవచ్చు అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఒకప్పటిలా డిస్ట్రిబ్యూషన్ వ్య‌వ‌స్థలో పోటీ కారణంగా నిర్మాత చెప్పిన ధ‌ర కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కుపోవ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్లు ముందుకొచ్చే అవకాశం లేదు. హీరోకి సంబంధించిన హిట్లు ఫ్లాపులను యావరేజ్ వేసుకొని మాత్ర‌మే సినిమా బిజినెస్ జ‌ర‌గ‌డం ఖాయమని అంటున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్థితులు మళ్ళీ ఎప్పటిలా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే మాత్రం మున్ముందు ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
Tags:    

Similar News