పరిశ్రమలో ఒక అగ్ర నిర్మాత వేరొక నిర్మాతకు సహకరించడం అంటే దాని వెనక లాజిక్ కాస్త ఆలోచించదగినదే. అయితే ఆ తరహా సాయం చేస్తూ ఓ అగ్ర నిర్మాత హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఆయన సాయం చేస్తున్నది ఎవరికో తెలుసా? బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ కి.
అయితే అతడు ఎంత బ్లాక్ బస్టర్ నిర్మాత అయినా ఇప్పుడు కాదు కదా? మధ్యలోనే చేసే పని వదిలి రాజకీయాలు అంటూ అటూ ఇటూ ఊగారు. పైగా నటుడిగానూ రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ క్రమంలోనే అతడు నిర్మాతగా ఎంతవరకూ సస్టెయిన్ అవుతాడు? అన్న సందిగ్ధత అలానే ఉంది. ఇదివరకూ పలు కాంట్రవర్శీలు సహా డిజాస్టర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇవన్నీ మార్కెట్ వర్గాలకు రుచించేవి కావు. అయినా అతడు తిరిగి నిర్మాతగా ఎదిగేందుకు సీరియస్ గా ట్రయల్స్ లో ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశంలో అతడికి దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత బ్యాకప్ ఇస్తుండడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిస్తోంది. గణేష్ నటుడిగా ఉన్నప్పటి నుంచి దిల్ రాజు ఎంతో సన్నిహితుడు. అందుకే ఈ సాయం చేస్తున్నారా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.
మరో కోణంలో బ్లాక్ బస్టర్ నిర్మాతను అడ్డు పెట్టుకుని తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీకి దిల్ రాజు ఏదైనా స్కెచ్ వేశారా? అన్న కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇక బండ్లకు సాయం చేసే స్కీమ్ లో వేరొక ఫైనాన్షియర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఫైనాన్షియర్ సత్యరంగయ్య బండ్లను తిరిగి లైమ్ లైట్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాల్లో ఉన్నారట. ఇంతకీ దిల్ రాజు - సత్య రంగయ్య ఏ హీరో కోసం హెల్ప్ చేస్తున్నారు? అంటే.. నేచురల్ స్టార్ నాని హీరోగా బండ్ల ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. నాని కాల్షీట్లు లాక్ చేయాలని సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాని మాత్రం ప్రామిస్ చేయడం లేదట. ఏదోలా నానీని ఒప్పించాలి. అందుకోసం దిల్ రాజు - రంగయ్య బృందం సాయం చేస్తోంది. అయితే సరైన కథ సెట్టయితే చేద్దాంలే! అని మొహమాటానికి నాని ఓ మాటైతే ఇచ్చాడు కానీ ఆసక్తిగా లేరని చెబుతున్నారు. ఇక బండ్ల తిరిగి రీబూట్ అయితే నానీతో ఏం కర్మ అటు మెగా హీరోలతోనూ కాల్షీట్లు కొట్టేయడం అంత పెద్ద కష్టమేమీ కాదు. పవన్ కల్యాణ్ .. రామ్ చరణ్ .. సాయిధరమ్ ఇలా అందరినీ దారిలో పెట్టేస్తాడు. అయితే పవర్ స్టార్ తో కలిసి సినిమా చేయాలంటే బండ్లతో పని సులువుగా అవుతుంది. అందుకే దిల్ రాజు అతడిని కలుపుకుని ఇలా కొత్త ప్లాన్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది అట్నుంచే క్లారిటీగా తేలాల్సి ఉంది.