'హరి హర వీరమల్లు' షూటింగ్ అప్డేట్.. పవన్ తో దర్శకనిర్మాతల మీటింగ్..!
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ ''హరి హర వీరమల్లు''. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ పీరియాడికల్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునఃప్రారంభం కానుంది. దీనికి సంభందించి పవన్ కళ్యాణ్ తో చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం - డైరెక్టర్ క్రిష్ ఈరోజు చర్చలు జరిపారు.
పవన్ ప్రస్తుతం నటిస్తున్న 'భీమ్లా నాయక్' షూటింగ్ పూర్తవగానే "హరి హర వీరమల్లు" చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించవలసిన కీలక సన్నివేశాలు - పాటలు - ఫైట్ సీన్స్ - షూటింగ్ లొకేషన్స్ - భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర దర్శకనిర్మాతల మధ్య సమాలోచనలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ‘వీరమల్లు’ షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయిందని.. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా "హరిహర వీరమల్లు" చిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీల శకం నేపథ్యంలోని కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు క్రిష్.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. 'హరిహర వీరమల్లు' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ - మలయాళ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. పాపులర్ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ సినిమాలో భాగం అవుతున్నారు. పవన్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ఫస్ట్ హిస్టారికల్ మూవీ 'వీరమల్లు' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.