రణబీర్ కపూర్ - అలియా భట్ నాయకానాయికలుగా నటించిన 'బ్రహ్మాస్త్ర' పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న సినిమా విడుదలవుతోంది. ట్రైలర్ ను జూన్ 15 న విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. అంతకుముందే బ్రహ్మాస్త్రకు పాన్ ఇండియా స్ట్రాటజీతో ప్రమోషన్ ని భారీగా ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం..మెగాస్టార్ చిరంజీవితో బ్రహ్మాస్త్ర టీమ్ కలిసి పనిచేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
ఇప్పటికే బ్రహ్మాస్త్ర టీమ్ దర్శకధీరుడు S.S రాజమౌళితో టై అప్ అయ్యి ప్రచారంలో వేడి పెంచింది. పౌరాణిక యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందిన బ్రహ్మాస్త్రను నాలుగు సౌత్ భాషలలో రాజమౌళి ప్రెజెంట్ చేస్తుండడంతో అది ప్రచారానికి కలిసొచ్చింది. సౌత్ లో ప్రచారం కోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడుచుకునేందుకు రణబీర్ టీమ్ సిద్ధంగా లేరు. తాజాగా బ్రహ్మాస్త్ర నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని బరిలో దించి తెలుగు రాష్ట్రాల్లో మరింత హైప్ పెంచాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
ఇటీవల దర్శకుడు అయాన్ ముఖర్జీ హైదరాబాద్ లో చిరంజీవిని కలిశారట. చిరు కేవలం ప్రమోషన్ చేయడమే కాదు.. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్రకు తెలుగు వెర్షన్ డైలాగ్స్ కి అనువాదాన్ని కూడా చిరు అందిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈరోజు ఈ వివరాలను తెలిపేందుకు బ్రహ్మాస్త్ర టీమ్ సమావేశమవుతుందని కూడా ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇందులో అక్కినేని నాగార్జున- మౌని రాయ్ - డింపుల్ కపాడియా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నడూ లేనిది ఈసారి పాన్ ఇండియా రీచ్ కోసం రణబీర్ కపూర్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు మార్కెట్లోనూ పాగా వేయాలని కసితో పని చేస్తున్నాడని అర్థమవుతోంది. ఒక రకంగా ఖాన లు కుమార్ ల కంటే తెలివిగా ఆలోచిస్తూ కపూర్ రియలైజ్ అయ్యాడని అర్థమవుతోంది. సౌత్ మార్కెట్ అవసరమేంటో బాలీవుడ్ నెమ్మదిగా గ్రహిస్తోంది. ఇన్నాళ్లు పట్టించుకోని వాళ్లు.. ఇకపై సౌతిండియాలో ప్రచారంపైనా అక్కడి స్టార్లు దృష్టి సారిస్తారనడంలో ఎలాంటి సందేహాలు లేవు.
కపూర్ ముందు పెను సవాల్ ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 ఇటీవలి సంచలనాల గురించి తెలిసిందే. హిందీ ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాశాయి ఈ చిత్రాలు. వీటిని కొట్టేది ఎవరు? అన్న చర్చా ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ తేలిపోగా..రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' ... అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'పైనే ఆశలన్నీ! కానీ వీళ్లలో ఎవరికి ఉంది అంత సీన్? అన్న చర్చా సాగుతోంది.
సౌతిండియా భారీ చిత్రాలు ఆర్.ఆర్.ఆర్ తో పాటు యష్ నటించిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి. KGF చాప్టర్ 2 హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు హిందీ బాక్సాఫీస్ వద్ద 53.95 కోట్లు వసూలు చేసింది. హిందీ మార్కెట్ లో ఒక సినిమాకు ఇదే అత్యధిక ఓపెనింగ్స్. యశ్ నటించిన కేజీఎఫ్ 2 .. హృతిక్ వార్ చిత్రం ఓపెనింగుల రికార్డును బద్దలు కొట్టింది. మొదటి రోజు వార్ కేవలం 53.53 కోట్లు వసూలు చేసింది. కానీ యష్ కేజీఎఫ్ 2 కేవలం రెండు రోజుల్లోనే రూ. 100.74 కోట్లతో ఏడు రోజుల్లోనే 250 కోట్ల మార్కును రాబట్టింది. 1000 కోట్ల క్లబ్ లోనూ అడుగుపెట్టి బాహుబలి 2 తర్వాతి స్థానంలో నిలిచింది.
అయితే ఇలాంటి రికార్డును కొట్టాలని పంతంతో రూపొందించినదే బ్రహ్మాస్త్ర. కానీ ఈ సినిమాని సౌత్ లో ఏ మేరకు ఆదరిస్తారు? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం చాలా బాలీవుడ్ భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాని డామినేట్ చేసే హిందీ చిత్రమేదీ? అన్న చర్చ వేడెక్కిస్తోంది. దీనిని కపూర్ బోయ్ ఒక సవాల్ గా తీసుకున్నారనే ఇప్పటికి భావిద్దాం.