ఘాటు మాటలతో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసిన సినీ నటుడు కమ్ రాజకీయనేత పృథ్వీ. ఆయన్ను ఆయన పేరుతో చెబితే చాలామందికి గుర్తుకు రారు. కానీ.. పృథ్వీ పేరు ముందు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నంతనే.. నిండైన ఆయన విగ్రహం.. మాంచి బేస్ ఉన్న వాయిస్ తో ఇట్టే కళ్ల ముందు కదలాడతారు. సాధారణంగా సినీ నటుడు ఎవరైనా సరే.. తాను నటించిన సినిమాను ఇంటిపేరుగా చేసుకుంటారు.కానీ.. పృథ్వీ మాత్రం కాస్తంత భిన్నం. తాను నటించిన సినిమాలోని ఒక డైలాగ్ ను ఇంటి పేరుగా మార్చేసుకున్నారని చెప్పాలి.
ఇంతకీ పృథ్వీ రాజ్ ఇంటిపేరు ఏమిటో తెలుసా? ఆ విషయాన్ని తాజాగా ఆయనో ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు.. తన పేరు చివరన తన ఇంటి పేరును వేసుకొని.. పాపులర్ అయి ఉంటే.. తన పరిస్థితి మరోలా ఉండేదన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఆయన ఇంటిపేరేమిటంటే.. ‘బలిరెడ్డి’. తాను ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదని.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరూ క్యాస్ట్ ఫీలింగ్ తో మాట్లాడలేదన్నారు. కానీ.. కాపులంటే వివక్ష ఉందని.. తాను దానికి బలైనట్లుగా చెప్పుకున్నారు. తన ఇంటిపేరు బలిరెడ్డిఅని.. తన పేరు చివరన అది వేసుకొని.. పృథ్వీ రాజ్ బలిరెడ్డి అని పెట్టుకొని ఉంటే తానెక్కడికీ కదిలేవాడ్నికాదేమో? అంటూ వాపోయారు.
ఇక.. వైసీపీ నేతగా ఉన్న రోజుల్లో తాను చేసిన విపరీత వ్యాఖ్యల గురించి చెబుతూ.. చెంపలేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. అమరావతి రైతులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పటం గమనార్హం. ‘అమరావతి రైతులకు మీ ద్వారా క్షమాపణలు. నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటిదాకా నేను మాట్లాడింది రైతులు వినే ఉంటారు. కొవ్వుతో మీ గురించి మాట్లాడాను. నన్ను క్షమించండి’ అంటూ ఓపెన్ అయ్యారు.
తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెబుతూ.. తన తండ్రి బలిరెడ్డి సుబ్బారావు అని.. శ్రీక్రిష్ణావతారంలో కర్ణుడిగా వేశారని.. కైకాల సత్యనారాయణ ఆయనకు మంచి స్నేహితుడని చెప్పారు. తన తండ్రి దాదాపు 17 సినిమాలు చేశారని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ.. ‘‘ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నాగబాబు బాగా తిరిగి జనాల్ని మొబలైజ్ చేసి.. మీటింగ్ లు పెట్టారు. అప్పుడు ఆయన వెంట నేను ఉండేవాడ్ని. చిరంజీవి మితభాషి. ఆత్మాభిమానం ఎక్కువ. ఎవర్నీ విమర్శించొద్దనేవారు. తర్వాత కాంగ్రెస్ లో వెళ్లిపోయారు. ఒకాయన నన్నుకూర్చోబెట్టి.. ‘నువ్వు అటు వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ గట్టిగా మాట్లాడేవారు లేరు. నువ్వు అటు వెళ్లిపో అన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఇచ్చిన సూచనతో వైసీపీలోకి చేరా’ అని చెప్పారు.
చిరంజీవి.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తాను అన్న మాటలు తప్పుగా భావిస్తున్నట్లుగా వాపోయారు. తాను చాలా తప్పు చేశానని.. అవసరమైతే మీ కాళ్లకు దండం పెడతానని చిరంజీవి.. పవన్ కల్యాణ్.. నాగబాబుకు చెబితే వాళ్లు నవ్వుతూ రియాక్టు అయ్యారు. ‘మాకు శత్రుత్వం లేదు. మేమెప్పుడు ఎవర్నీ అలా చూడలేదు. నీ దార్లో నువ్వు వెళ్లిపోయావ్. మాట్లాడావ్. అదంతా అయిపోయింది. ఇక ఆరోగ్యంగా.. హ్యాపీగా ఉండు. సినిమాలు ట్రై చేయ్. నీకు ఏదైనా చేయాలనిపిస్తే 2024లో ఉగ్రవాద సంస్థల వైపు కాకుండా.. ఒక మంచి బస్సు ఎక్కి.. ఆ బస్సుకి సపోర్టు చేయ్’ అన్నారన్నారు.
తాను జనసేనలో చేరతానని చెప్పారు పృథ్వీ. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కు కూడా చెప్పానని వెల్లడించారు. తన మాటలకు పవన్ రియాక్షన్ ఏమంటే.. ‘సినిమాలు చేసుకోండి. నేను తప్పకుండా పిలుస్తాను’ అని చెప్పారు. నా గురించి నేను అంచనా వేసుకున్నాక.. నేను సైలెంట్ గా ఉండి.. పది మంది పెద్దల ఆశీర్వాదం తీసుకొని.. ఇండస్ట్రీలో తిరుగుతూ.. ఎవరికైనా వీలైతే సాయం చేయటం.. ఎవరినీ నొప్పించకుండా ఉండటం.. ఇదే చాలు జీవితానికి అనుకుంటున్నా’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అందరిని ఆకర్షిస్తున్నాయి.