రెడు దశాబ్దాల తర్వాత పులి చిత్రం ద్వారా తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చింది అలనాటి అందాల తార శ్రీదేవి. తనను ఆకాశంలో కూర్చొబెడుతుందని శ్రీదేవి ఆశించిన ఈ చిత్రం.. చివరకు డిజాస్టర్ గా మిగిలింది. అయితే.. తనకు పులి నిర్మాతలు ఓ 50లక్షలు బాకీ ఉన్నారంటూ నిర్మాతల మండలికి శ్రీదేవి కంప్లెయింట్ ఇవ్వడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదుపై తమిళ నిర్మాతలు ఇచ్చిన వివరణ వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. 2.7 కోట్ల రెమ్యూనరేషన్, సర్వీస్ ట్యాక్స్ రూపంలో 30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే.. రిలీజ్ కు దగ్గరవుతున్న టైంలో ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలంటే అదనంగా ముట్టచెప్పాలని శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్ కండిషన్ పెట్టారట. ఈ మూవీలో చేసిన ఏ ఇతర నటులకు డబ్బింగ్ వెర్షన్ కోసం అదనంగా చెల్లింపులు చేయకపోయినా.. శ్రీదేవికి మాత్రం తెలుగు వెర్షన్ కోసంం 15 లక్షలు, హిందీ డబ్బింగ్ వెర్షన్ శాటిలైట్ రైట్స్ లో 20శాతం.. మొత్తం కలిపి 55 లక్షలు కట్టారట శ్రీదేవికి.
అంతేకాదు తనకు కాస్ట్యూమ్ డిజైనర్ గా మనీష్ మల్హోత్రానే ఉండాలని చెప్పి ఆయనకో 50 లక్షలు ఇప్పించిందట ఈమె. అలాగే మార్కెటింగ్ డిజైనర్ కి మరో 8 లక్షలు కట్టించింది శ్రీదేవి. హిందీ వెర్షన్ కోసం కోటి వదిలించుకుంటే.. ఆమార్కెట్ నుంచి రూపాయి కూడా రాలేదని.. మొత్తం మీద శ్రీదేవి తమకు 50 లక్షలు బకాయి పడిందని చెప్పారు పులి నిర్మాతలు శెల్వ కుమార్, సిబు తమీన్స్. ఆ డబ్బులు ఆవిడే మాకు తిరిగివ్వాలని కోరుతూ వారు షాకిచ్చారు.
నాలుగు పేజీల ఈ సుదీర్ఘ వివరణ బాగానే హైలైట్ అయిందిపుడు. అమ్మో శ్రీదేవిని భరాయించడం ఇంత కష్టమా అని ఇతర నిర్మాతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. చూస్తుంటే.. అనవసరంగా ఇష్యూ కదిపిందేమో శ్రీదేవి అనిపిస్తోంది..