మలయాళ నటి భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భావన కిడ్నాప్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నిందితుడు పల్సర్ సునీల్ గురువారం కోర్టు ఎదుట హాజరయ్యాడు. అతడిని పోలీసులే పట్టుకున్నారని.. లేదు అతనే లొంగిపోయాడని రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రధాన నిందితుడు దొరకడంతో ఈ కేసు త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఐతే కిడ్నాప్ వ్యవహారమంతా సునీల్ ఆధ్వర్యంలోనే నడిచినప్పటికీ అతడి వెనుక ఒక హీరో ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తన అనుచరుడు విజేష్ తో కలిసి వచ్చిన సునీల్ కొచ్చి చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సరెండరయ్యాడు. అనంతరం కోర్టు వెలుపల భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు న్యాయమూర్తి చాంబర్లోకి వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. నిందితులతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్న న్యాయవాదుల్ని సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు లాగిపడేశారు. తర్వాత నిందితులను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఐతే నిందితుల తరఫు న్యాయవాదులేమో.. నిందితుల్ని గుర్తు తెలియని వ్యక్తులే బయటకు తీసుకెళ్లినట్లుగా ఆరోపిస్తున్నారు. నిందితులు ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ పై విచారణను కేరళ హైకోర్టు మార్చి 3కు వాయిదా వేసింది. మరి ఈ కేసులో పల్సర్ సునీల్ వెనుక ఉండి అంతా నడిపించిన హీరో వ్యవహారం బయటికి వస్తుందో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/