కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలు ఆదివారం ఉదయం పూర్తి అయ్యాయి. శుక్రవారం మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలను శనివారం సాయంత్రం వరకు నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కన్నడ ప్రభుత్వం అందుకు సిద్దంగా ఉంది. అయితే యూఎస్ లో ఉంటున్న పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి బెంగళూరు చేరుకోవడం ఆలస్యం అయ్యింది. ఆమె శనివారం సాయంత్రంకు చేరుకున్నారు. బెంగళూరు కంఠీరవ స్టేడియంకు ఆమె చేరుకుని తండ్రికి కన్నీటి నివాళి సమర్పించారు. తండ్రి మృత దేహంను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. అప్పటికే సూర్యస్తమయం అయిన కారణంగా అంత్య క్రియలను కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆదివారంకు వాయిదా వేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు.
సాంప్రదాయం ప్రకారం సూర్యస్తమయం తర్వాత అంత్య క్రియలు జరపకూడదు. అందుకే పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలను వాయిదా వేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలోనే కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ ను కూడా ఖననం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు కన్నడ ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు మరియు సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా హాజరు అయ్యారు.
ఇతర భాషలకు చెందిన ప్రముఖులు కూడా కొందరు శనివారం పునీత్ రాజ్ కుమార్ మృత దేహంను సందర్శించి నివాళ్లు అర్పించారు. అందులో కొందరు ఆదివారం జరిగిన అంత్యక్రియల వరకు ఉండగా కొందరు మాత్రం తిరిగి వెళ్లి పోయారు. కుటుంబ సభ్యులు మరియు అభిమానుల కన్నీటి మద్య పునీత్ రాజ్ కుమార్ మృత దేహంకు ప్రభుత్వ లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శుక్రవారం మృతి చెందినప్పటి నుండి అంత్య క్రియలు పూర్తి అయ్యే వరకు అభిమానులు లక్షలాది మంది తరలి వచ్చి పునీత్ రాజ్ కుమార్ మృత దేహంకు నివాళ్లు అర్పించారు. ప్రధాని సహా ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కు సోషల్ మీడియా ద్వారా నివాళ్లు అర్పించారు.