రెండో కథలపై ఫోకస్ పెట్టిన జ'గన్'

Update: 2016-10-11 18:02 GMT
దర్శకుడు పూరి జగన్‌.. ఇప్పుడు తన తదుపరి కథలపై బాగానే ఫోకస్ పెడుతున్నాడు. మొన్నటివరకు ఆయన తొక్క వేస్తే ఒక కథ. తొక్క తీస్తే ఒక కత. అంటూ ఏవేవో కథలు రాశాడు. ఆ కథలన్నీ ఫెయిలయ్యాయి. అందుకే వేరే కథను తీసుకుని టెంపర్ తీశాడు. అయితే ఆ దెబ్బతో పూరి తన కథల రైటింగ్ స్టయిల్ లో చాలా ఛేంజస్ తెచ్చేశాడు అంటున్నారు.

ఇప్పుడు పూరి జగన్ ''ఇజం'' కథను ఇచ్చిన తరువాత.. ఈసారి తాను రాసే కథలన్నీ చాలా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాడట. కాకపోతే అనవసరమైన కొత్త కథలకు పోకుండా.. గతంలో తాను తీసిన కథలకే ఇప్పుడు రెండో కథను రాస్తున్నాడట. అదేనండీ సీక్వెల్ రాస్తున్నాడట. ఈడియట్ - పోకిరి - బిజినెస్ మ్యాన్ - అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ్ మొదలగు సినిమాల కథల నిజంగానే చాలా కిక్కిస్తాయి. వాటి కోసం ఇప్పుడు పూరి సీక్వెల్ కథలను రెడీ చేస్తున్నాడట. ఒకవేళ మెగా ఫ్యామిలీలో ఎవరైనా చేస్తానంటే మాత్రం మనోడు బద్రి సీక్వెల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడని తెలుస్తోంది.

మొత్తానికి పాత సీసాలో పాత కథలను ఇచ్చే బదులు.. కొత్త సీసాలో పాత కథల వాసనతో కొత్త కథను అందిస్తే బెటరే కదా. లెటజ్ సీ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News