ఫ్లాపులొచ్చినా పూరి మళ్లీ సినిమా చేస్తున్నారు అంటే ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వస్తుంది. `మెహబూబా` ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అయినా పూరి మాత్రం తన పనిలో తాను ఉన్నాడు. గత కొంతకాలంగా స్క్రిప్టుల్ని ఫైనల్ చేసే పనిలోనే ఉన్నాడు. ఎట్టకేలకు పూరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా ప్రారంభమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా పూరి కనెక్ట్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. పూరి కనెక్ట్స్ సంస్థలో తెరకెక్కబోయే తర్వాతి చిత్రం కోసం కాస్టింగ్ కాల్ వచ్చింది. చూడటానికి అందంగా కనిపిస్తూ.. నటనలో మెళకువలు తెలిసిన 18 నుంచి 23 మధ్య వయసున్న అమ్మాయిలకు ఇది సదావకాశం. ఆసక్తి ఉన్నవాళ్ళు సంప్రదించాల్సిందిగా కోరారు.
పూరి కనెక్ట్స్ పిలుపుతో అవకాశం అందుకోబోయే ఆ కొత్తమ్మాయి ఎవరో అంటూ అప్పుడే ఆసక్తికర చర్చ సాగుతోంది. పూరి ఇప్పటికే పలువురు కథానాయికల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. అందులో ఎందరో స్టార్లు అయిన వాళ్లు ఉన్నారు. ఇటీవలే `మెహబూబా` చిత్రంతోనూ ఓ కథానాయికను పరిచయం చేశారు. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ సైతం ఇలియానా, కీర్తి సురేష్ లాంటి మెరికల్ని పరిచయం చేశాడు. దేవదాస్ సినిమాతో ఇలియానా, నేను శైలజ చిత్రంతో కీర్తి సురేష్ ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ప్రస్తుతం పూరి- రామ్ కలయికలో మరో కొత్తమ్మాయి పరిచయం కానుంది.
ఇకపోతే ఇది నామమాత్రపు కాస్టింగ్ కాల్ అనుకోవాలా.. లేక జెన్యూన్ గానే కొత్తమ్మాయిలకు ఛాన్సిస్తున్నారా? అంటూ మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. పూరి కనెక్ట్స్ సీఈవోగా ఛార్మినే కాస్టింగ్ బాధ్యతలు చేపడుతున్నారు కాబట్టి తనదే ఈసారి ఎంపిక బాధ్యత అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రొఫైల్స్ వెతికి ఫైనల్ చేసే అవకాశం ఉందని .. అయినా ఇంకా ఎవరైనా ట్యాలెంటెడ్ గాళ్స్ కి అవకాశం ఇచ్చేందుకే ఈ పిలుపునిచ్చారా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య `పైసా వసూల్` సమయంలోనూ ఇలానే చేశారన్న మాటా వినిపిస్తోంది. అయినా పూరి వరుసగా రామ్, అలాగే ఆకాష్ తో సినిమాలు తీస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు ఆ కాంపౌండ్ లో ప్రవేశించి మెప్పించే నాయికలు, ఇతర నటీనటులకు లక్ చిక్కినట్టేనని భావించాలి.