తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సాహసోపేత సినిమా చేసి గొప్ప ఫలితమే అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయింది. ఇలాంటి పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. గత ఏడెనిమిదేళ్లలో ‘టెంపర్’ మినహాయిస్తే పూరికి నిఖార్సయిన హిట్టే లేదు. అది కూడా పూర్తిగా పూరి క్రెడిట్ కాదు. ఆ సినిమా కథ వక్కంతం వంశీది. ఈ సినిమా తర్వాత పూరి చేసిన నాలుగు సినిమాలూ డిజాస్టర్లే. అయినప్పటికీ పూరికి అవకాశమిచ్చి ఆశ్చర్యపరిచాడు బాలయ్య. మరి బాలయ్య చేసిన ఈ సాహసానికి ఎలాంటి ఫలితం అందుతుందో ఈ రోజు తేలిపోతుంది. బాలయ్య-పూరిల ‘పైసా వసూల్’ ఈ రోజే థియేటర్లలోకి దిగుతోంది.
ఐతే ‘పైసా వసూల్’ తేడా కొడితే బాలయ్యకు వచ్చిన నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ప్రోమోలు చూస్తే బాలయ్య తన వరకు అభిమానుల్ని బాగానే ఎంటర్టైన్ చేసేట్లే కనిపిస్తున్నాడు. బాలయ్య తన వంతుగా ఏం చేయాలో అది చేసినట్లే కనిపిస్తున్నాడు. పూరి మార్కు హీరో పాత్రలోకి ఒదిగిపోయే ప్రయత్నం చేసినట్లున్నాడు. కాబట్టి సినిమా తేడా వస్తే బాలయ్యను ఎవరూ ఏమీ అనరు. నింద మొత్తం పూరినే మోయాల్సి ఉంటుంది. బాలయ్య ఇంత మంచి అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోలేదన్న చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు ఇంకో పెద్ద స్టార్ పూరితో చేయడానికి ముందుకు రాడు. పూరి మీద పూర్తిగా నమ్మకం పోతుంది. ఐతే ‘పైసా వసూల్’ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం పూరి కెరీర్ మళ్లీ పునరుజ్జీవం పొందినట్లే. కెరీర్లో ఇలా ఎన్నోసార్లు పడి లేచిన అనుభవం పూరికి ఉన్నప్పటికీ ఇప్పుడు పైకి లేస్తే మాత్రం ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇండస్ట్రీ మొత్తం పూరి వైపు చూస్తుంది. మరి ‘పైసా వసూల్’ పూరి కెరీర్ ను ఎలా టర్న్ చేస్తుందో చూద్దాం.