పూరి ప్రయత్నాలకు హైప్ రావట్లేదు

Update: 2017-09-16 04:29 GMT
టాలీవుడ్ లో ఏ హీరోతో అయినా వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసే దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీసే ఈ బ్రాండ్ డైరెక్టర్ ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఊహించని అపజయాలను ఎదుర్కొంటున్నాడు. రీసెంట్ గా ఎన్నో ఆశలు పెట్టుకున్న "పైసా వసూల్" సినిమా కూడా అయనకు నిరాశనే మిగిల్చింది.

అయితే ఈ సారి తానే నిర్మాతగా మారి తన కుమారుడిని గ్రాండ్ లాంచ్ చేయబోతున్నాడు. సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎప్పుడు లేనిది భారీగా క్యాస్టింగ్ కాల్ ఇస్తున్నాడు. సినిమాలో పూర్తిగా కొత్తవారిని పూరి సెలెక్ట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడట. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషులు అలాగే 18 నుంచి 45 ఏళ్ల వయసున్న స్త్రీలు యాక్టింగ్ టాలెంట్ ఉండి సినిమాలో చేయాలనుకుంటే ప్రయత్నం చేయవచ్చు అని ఒక నోట్ ని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం హీరోయిన్ వేటలో ఉన్న ఆయన ఛార్మి ఆధ్వర్యంలో సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ని ఎంపిక చేయనున్నారట. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ సినిమా కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తీ చేసుకున్నాడట పూరి. కేవలం ఛార్మి ఒక్క నటీనటులను ఎంపిక చేస్తే పూరి ఫైనల్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడని టాక్.     

గతంలో పూరి చాలాసార్లు ఇలా కొత్తకొతాళ్లను పెట్టి కొన్ని సినిమాల్లో ప్రయత్నాలు చేశాడు కాని.. ఈసారి మాత్రం ఈ ప్రయత్నాలు పెద్దగా హైప్ క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే మనోడు కంటెంట్ మీద ఫోకస్ పెట్టకుండా ఇలాంటి ప్రయత్నాలు మీదనే ఫోకస్ ఎక్కువపెడుతున్నాడనే భావన జనాల్లో కూడా వచ్చేసింది. చూద్దాం ఏం జరుగుతుందో!!
Tags:    

Similar News