మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి ముందు అనుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. చిరు కోసం ‘ఆటోజానీ’ అనే కథ కూడా రెడీ చేశాడు పూరి. ఐతే ప్రథమార్ధం వరకు చిరుకు ఆ కథ నచ్చింది కానీ.. సెకండాఫ్ ఓకే కాలేదు. ఈలోపు చిరు కళ్లు ‘కత్తి’ రీమేక్ మీద పడ్డాయి. పూరి సైడ్ అయిపోయాడు. ఐతే చిరు కాదన్న స్టోరీనే నందమూరి బాలకృష్ణ కోసం పూరి కొంచెం మార్చి.. ఆయనతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ‘ఆటోజానీ’లో చిరు ఆటో డ్రైవర్ అయితే.. బాలయ్యను ట్యాక్సీ డ్రైవర్ గా చూపించబోతున్నాడని.. ఇంకా చిన్న చిన్న మార్పులు చేసి పాత కథతోనే లాగించేస్తున్నాడని ఊహాగానాలు వినిపించాయి.
ఐతే పూరి ఈ ప్రచారాన్ని ఖండించాడు. బాలయ్యతో చేస్తున్నది ఫ్రెష్ స్టోరీ అని చెప్పాడు. చిరు పేరెత్తకుండా తాను ఈ కథను ఇంతకుముందు ఇంకే హీరోకూ చెప్పలేదని తెలిపాడు. ఎవరికో చెప్పిన కథను ఇంకో హీరో కోసం మార్చాల్సిన పని లేదని.. తన దగ్గర బోలెడన్నది కథలున్నాయని పూరి తెలిపాడు. పదేళ్లకు సరిపడ కథలు తన దగ్గర రెడీగా ఉన్నాయని పూరి చెప్పడం విశేషం. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాలో బాలయ్య ట్యాక్సీ డ్రైవర్ కాదని.. ఆయన పోషిస్తున్నది గ్యాంగ్ స్టర్ పాత్ర అని తెలిపాడు. ‘దేశముదురు’ వరకు తాను దర్శకుడు కావడానికి ముందు కథల్నే తెరకెక్కించానని.. ఆ తర్వాతే కొత్త కథలు రాస్తున్నానని పూరి చెప్పడం విశేషం. తాను అనుకుంటే ఒక్క రోజులో ఓ కథ రాయగలనని.. రెండు వారాల్లో పూర్తి స్క్రిప్టు రెడీ చేయగలనని పూరి అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/