పూరీ ఇండైరెక్ట్ గా నాగబాబుకి కౌంటర్ వేశాడా...?

Update: 2020-05-31 13:58 GMT
సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరీ రియల్ లైఫ్ లో ఎలాంటి ఆటిట్యూడ్ చూపిస్తుంటాడో అదే తన సినిమాల్లో హీరోకి క్రియేట్ చేస్తుంటాడు. తనకి నచ్చని వ్యక్తుల గురించి నచ్చని విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని మొహం మీదే చెప్తూ ఉంటాడు. అది తన గురువు రామ్ గోపాల్ వర్మ అయినా తను డైరెక్ట్ చేసిన స్టార్ హీరో అయినా సరే. కాగా ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరీ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్ళీ సూపర్ హిట్ అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీకి తన స్టామినా ఏంటో మరొక్క సారి గుర్తు చేసాడు. ఇస్మార్ట్ సక్సెస్ అందుకున్న ఊపులో విజయ్ దేవరకొండ హీరోగా పూరీ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. అయితే ఈ గ్యాప్ లో తన సినిమాకు సంబంధించిన పనులతో పాటు సోషల్ మీడియాలో కూడా జగన్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ''బీ ఏ లయన్'' అంటూ ఓ ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఇది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని ట్వీట్ చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పూరీ జగన్నాథ్ ట్వీట్ చేసిన ఈ వీడియో అడవిలో నివశించడం ఎలా అంటూ స్టార్ అయి పలు ప్రశ్నలు సమాధానాలతో సాగింది.'అతి పెద్ద జంతువు' ఏది అని అడిగితే నేను 'ఏనుగు' అని చెప్పడం విన్నాను. 'పొడవైన జంతువు' ఏదీ అని అడిగితే నేను 'జిరాఫీ' అని చెప్పడం విన్నాను. తెలివైన జంతువు ఏది అని అడిగితే నేను 'నక్క' అని చెప్పడం విన్నాను. వేగంగా పరిగెత్తే జంతువూ ఏదని అడిగితే నేను చిరుత అని చెప్పడం విన్నాను. ఇప్పటి దాకా చెప్పిన వండర్ ఫుల్ క్వాలిటీస్ లో 'లయన్' లేదు కదా అంటే.. లేకపోతేమీ 'సింహం' 'అడవికి రాజు' అని మీరు అంటున్నారు. ఎందుకంటే 'సింహం' ధైర్యవంతుడు.. బోల్డ్.. కాన్ఫిడెంట్ గా నడుస్తుంది. సింహం ప్రతీదాన్ని దాన్ని డేర్ గా ఎదుర్కొంటుంది ఎవరికీ భయపడడు. నన్నెవరూ ఆపలేరని భావిస్తుంది. సింహం తనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ చేజార్చుకోదు. మనం సింహం నుండి ఏమి నేర్చుకోవాలి? నువ్వు వేగంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు.. స్మార్ట్ బ్రిలియంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది 'ధైర్యం' 'బోల్డ్ నెస్' నీపైన మీకున్న నమ్మకం. ఇప్పుడు అది బయటకి తీసే టైం వచ్చింది. నీలో కూడా ఒక సింహం ఉన్నాడు అని వీడియో ముగుస్తుంది. అయితే ఇప్పుడు పూరీ ఈ వీడియో బాలయ్యని ఉద్దేశించే రిలీజ్ చేశాడంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా బాలయ్య - నాగబాబు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ పెద్దలు తనని పిలవకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. అయితే ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి బాలయ్యపై ఒక వీడియో ద్వారా విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు జస్ట్ ఒక హీరో మాత్రమే అంటూ పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ ట్వీట్ బాలయ్యని ఉద్దేశిస్తూ నాగబాబు కి ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసాడంటూ నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. మేము అడవి లో తిరిగే సింహం చూడలేదు కానీ జనంలో తిరిగే సింహం బాలయ్యని చూసాం అంటున్నారు. మ్యాడ్ డాగ్స్ ఎన్ని మొరిగినా మేము పట్టించుకోమంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూరీ - బాలయ్యకి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. త్వరలోనే వీరి కాంబినేషన్ లో మూవీ కూడా రాబోతోంది. ఖచ్చితంగా ఈ ట్వీట్ నాగబాబు కి కౌంటర్ అని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ ట్వీట్ పూరీ ఏ ఉద్దేశ్యం తో వేశాడో తెలియదు కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఖుషీగా ఉన్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News