పైసా వసూల్ లో 'మెగా' పంచులా??

Update: 2017-08-21 17:30 GMT
చాలామంది దర్శకులకు హీరోలకు ఒక అలవాటు ఉంది. ఒక సినిమాలో వేరే సినిమాల గురించి లేదంటే వేరే హీరోల గురించి పంచులు వేస్తుంటారు. చాలాసార్లు అవన్నీ కూడా కేవలం ఫన్ కోసం పెట్టినవే ఎవరినీ ఉద్దేశించినవి కావు అని చెప్పినా కూడా.. నిజానికి అక్కడ ఖచ్చితంగా పంచులు మాత్రం పేలతుంటాయ్. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్ కూడా అదే చేస్తున్నాడు అని ఒక టాక్ వినిపిస్తోంది.

ఫిలిం నగర్లో వినిపిస్తున్న తాజా అప్డేట్ ఏంటంటే.. పైసా వసూల్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పైన కొన్ని మెగా పంచులు వేయించాడట పూరి జగన్. అయితే బాలయ్య క్యారక్టర్ ఈ పంచులు వేయలేదు కాని.. ఆలీ క్యారక్టర్ తో వీటిని వేసినట్లు ఒక టాక్ వినిపిస్తోంది. గతంలో పూరి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాను చేస్తారని ముందుగా ప్రకటించినా.. తరువాత ఆ సినిమాను చేయడంలేదని.. సెకండాఫ్‌ బాగాలేదని మీడియా ముఖంగా చెప్పేశారు మెగాస్టార్. దినతో మనస్తాపం చెంది పూరి జగన్ ఏదన్నా సెటైర్ వేశాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పూరి జగన్ స్వతాహాగా అలా సెటైర్లు వేసే మనిషికాదు.. చాలా పాజిటివ్ మనిషని.. ఒకవేళ మెగాస్టార్ తో 150వ సినిమా కాకపోతే 160వ సినిమా చేస్తాను అంటూ గతంలో చెప్పాడు కదా అంటూ ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు పూరి ఏం చేసుంటాడు అనే ఆసక్తి మాత్రం అన్నిచోట్లా ఉంది.
Tags:    

Similar News