ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే తన మొదటి షార్ట్ ఫిలిం మీద ఆసక్తి రేపిన దర్శకుడు పూరి జగన్నాధ్ తన డెబ్యు మూవీ హగ్ ని ఆన్ లైన్ లో అఫీషియల్ గా విడుదల చేసాడు. చెట్లు పెంచండి అనే మెసేజ్ ని కళాత్మకంగా చూపించిన తీరు బాగానే ఉంది కాని పోస్టర్ లో చూపించిన నగ్న సుందరిని చూసి ఏవేవో ఊహించుకున్న వాళ్ళకు మాత్రం నిరాశ తప్పలేదు. పర్యావరణం కాలుష్యం మనిషి జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తోందో కళ్ళారా చూస్తూనే ఉన్నా కూడా జనంలో మార్పు రావడం లేదు. ఢిల్లీ లాంటి నగరాల్లో ఇది పతాక స్థాయికి చేరి చివరికి స్కూళ్ళకు సెలవులు ఇచ్చే దాకా వచ్చింది పరిస్థితి. ఇది రానున్న కాలంలో ఇంకా తీవ్రంగా మారనుంది కాబట్టి ఒక హెచ్చరికగా పూరి ఈ షార్ట్ ఫిలిం రూపొందించాడు.
చెట్లకు మనుషులకు మల్లే ఫీలింగ్స్ ఉంటాయని చెబుతున్న పూరి వాటికి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని చెబుతున్నాడు. వైఫై నెట్ వర్క్ కన్నా ట్రీస్ ప్లాంటింగ్ మానవాళిని కాపాడుతుంది అని చెప్పడం పూరి మార్క్ లో బాగుంది. ఇక అందరు ఊహించుకునట్టు పోస్టర్ లో చూసిన నగ్న సుందరి అసలు ఇండియన్ హీరొయిన్ కాదు. ఫారిన్ మోడల్ ఇసాబెల్లా తో ఇది షూట్ చేసాడు పూరి. సందీప్ చౌతా సంగీతం శ్రావ్యంగా ఉంటె షార్ట్ ఫిలిం మొత్తం క్యాతరినా క్రివెంకో వాయిస్ ఓవర్ లో సాగుతుంది. అనిల్ పదూరి విజువల్ ఎఫెక్ట్స్ మంచి బ్యూటీ ఇస్తే జునైద్ ఎడిటింగ్ చాలా క్రిస్పి గా ఉంది. కాని మొత్తం ఇంగ్లీష్ లోనే ఉండటం వల్ల పూరి ఇచ్చిన సందేశం అందరికి రీచ్ కాకపోవచ్చు. బహుశా రానున్న రోజుల్లో డబ్ చేస్తాడేమో చూడాలి. మరి ఎక్కువ ఆశించకుండా మెసేజ్ కోణంలో కేవలం 3.5 నిముషాలు మాత్రమే ఉన్న ఈ షార్ట్ ఫిలింపై మీరూ ఒక లుక్ వేయొచ్చు. నగ్నంగా ఉండే చెట్టుని హగ్ చేసుకోండి దాని ఫీలింగ్స్ అర్థం అవుతాయి అని పూరి చెప్పడం ఇందులో మెయిన్ థీం.
Full View