కొత్త సినిమా అనగానే పూరి జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్లిపోతుంటారు. అక్కడే వారం - పది రోజులు మకాం వేసి పూర్తి స్థాయిలో స్క్రిప్టుని సిద్ధం చేసుకొని తిరిగొస్తుంటారు. వీలు కుదిరితే లిరిక్ రైటర్లని - మ్యూజిక్ డైరెక్టర్లని కూడా తీసుకెళ్లి పాటలు - బాణీల్ని కూడా సిద్ధం చేయించి తీసుకొస్తుంటారు. అయితే ఇక్కడ కథానాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పూరికి బ్యాంకాక్ వెళ్లడం అలవాటు. మొదట ఓ లైన్ గా చెప్పి కథానాయకుల్ని ఒప్పించడం, ఆ తర్వాత పూర్తిస్థాయిలో స్క్రిప్టుని తయారు చేసుకొని సినిమాని పట్టాలెక్కించడమే పూరి స్టైల్. కానీ ఈసారి వ్యవహారాలు మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. పూరి `ఇజం` ప్రేక్షకుల ముందుకొచ్చి కూడా రెండు వారాలపైనే అవుతోంది. కానీ ఆయన ఎవరితో సినిమా చేస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ బ్యాంకాక్ కి మాత్రం వెళ్లాడు.
అక్కడ కొత్త సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని సిద్ధం చేసే పనిలో పడిపోయాడు. మరి ఆ కథ ఎవరికోసం అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. `ఇజం` సెట్స్ పై ఉన్నప్పుడు ఎన్టీఆర్ తోనే పూరి సినిమా చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఇటు ఎన్టీఆర్ కానీ - పూరి కానీ తాము చేయబోయే కొత్త సినిమా గురించి ప్రకటించనే లేదు. పూరి కూడా స్వయంగా `అనుకొన్నాం కానీ - ఇంకా డిసైడ్ అవ్వలేదు` అని మీడియాతో చెప్పారు. మరి లోలోపల ఆ ఇద్దరూ ఓకే చెప్పుకొని పని మొదలుపెట్టారా లేదంటే పూరికి వేరే కథానాయకుడెవరైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరు ఒప్పుకొన్నా - ఒప్పుకోకపోయినా పూరి మాత్రం టైమ్ వేస్ట్ చేయడు. ఆఖరికి స్టార్లు కాని యువ హీరోలతోనూ సినిమా చేసేయగల సమర్థుడాయన. సొంత బ్యానర్ కూడా ఉంది కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. పూరి కనెక్ట్స్ పేరుతో సొంతంగా సినిమాలు నిర్మించాలనుకొంటున్నాడు. అందులో సినిమా కోసమే బ్యాంకాక్ వెళ్లాడన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/