పూరి జగన్నాధ్ - రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద్. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం కావడంతో మొదటి రోజు థియేటర్ల ఆక్యుపెన్సీ బాగుందని ఇప్పటికే రిపోర్టులు వచ్చాయి. అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నా ఓవరాల్ గా చూస్తే పూరి గత చిత్రాలకంటే బెటర్ అంటున్నారు. దీంతో పూరి గురువుగారు రామ్ గోపాల్ వర్మ తెగ ఎగ్జైట్ అయ్యారు.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా శిష్యుడిని అభినందిస్తూ ట్వీట్ చేశారు "హే.. పూరి జగన్నాధ్ & రామ్ మీరు క్షణం ఆలస్యం చేయకుండా ఇస్మార్ట్ శంకర్ 2 ను మొదలు పెట్టండి ప్లీజ్. డబల్ దిమాక్ కు బదులుగా అది ట్రిపుల్ దిమాక్ అయి ఉండాలి" అంటూ శిష్యుడిపై తన ప్రేమను కురిపించారు. పూరి జగన్నాధ్ రిప్లై ఇస్తూ "సర్.. డబల్ ఇస్మార్ట్ టైటిల్ ను ఇప్పటికే రిజిస్టర్ చేశాం" అంటూ సీక్వెల్ టైటిల్ సంగతిని అధికారికంగా వెల్లడించాడు. దీనికి మళ్ళీ స్పందించిన గురువుగారు "వా.......వ్. అది ఇంకా బెటర్" అంటూ డబల్ ఇస్మార్ట్ టైటిల్ కు తన జేజేలు తెలిపారు.
అంతటితో ఊరుకోకుండా "హే ఛార్మీ.. రేపు నేను మీ ఇస్మార్ట్ శంకర్ టీమ్ తో పార్టీ చేసుకునేందుకు వస్తున్నాను" అంటూ పార్టీ డిక్లరేషన్ ఇచ్చాడు. ఇంకేముంది.. జింతాత జిత జిత మొదలు. సారీ.. కొత్త డైలాగ్ వచ్చేసింది కదా.. "ఛోడ్ చింతా మార్ ముంతా"..!