పూరితో అల్లరి నరేష్‌.. సెట్టవ్వుద్దా??

Update: 2016-02-19 16:19 GMT
బీభత్సమైన పొటెన్షియల్‌ ఉన్న నటుడు అల్లరి నరేష్‌. అయితే మనోడు ఎప్పుడూ కామెడీనే అంటి పెట్టుకొని ఉండటంతో.. అక్కడే ఉండిపోయాడు. ఇక ఈ మధ్యన రెండె మూడు సంవత్సరాల నుండి అన్నీ ఫ్లాపులే. అందుకే ఇప్పుడు ఏక్కడ తేడా కొట్టేస్తోందో తెగ సరి చూసుకుంటున్నాడు అల్లరోడు. అయితే ఈ సమయంలో పెద్ద డైరక్టర్లతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నాడట.

యాక్చువల్లీ మనోడు ఒకప్పుడు కృష్ణవంశీ వంటి డ్యాషింగ్‌ డైరక్టర్ తో ''డేంజర్‌'' వంటి సినిమా చేసినా కూడా.. ఎందుకో బ్రేక్‌ రాలేదు. పెద్ద డైరక్టర్లెవ్వరూ మనోడిని పెద్ద చాయిస్‌ గా కన్సిడర్‌ చేయలేదు. ఇప్పుడు మాత్రం కళ్యాణ్‌ రామ్‌ సినిమా తరువాత మహేష్‌ సినిమాను మొదలు పెట్టడానికి గ్యాప్ ఉంటే మాత్రం.. ఆ గ్యాప్‌ లో అల్లరి నరేష్‌ తో పూరి సినిమా చేయాలని చూస్తున్నాడట. అయితే ఈ కాంబినేషన్ అసలు సెట్టవుతుందా అనేదే ఇప్పుడు అందరి సందేహం.

ఒకవేళ నరేష్‌ మాత్రం.. తన పందాను మార్చి.. కామెడీని వదిలేసి.. పూరి వంటి డైరక్టర్ తో సినిమా చేస్తే మాత్రం అది సూపరే. ఇక ప్రస్తుతం మనోడు బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ప్రొడక్షన్‌ లో జి.నాగేశ్వర్‌ రెడ్డి డైరక్షన్‌ లో ఒక సినిమాను చేసే యోచనలో ఉన్నాడు.
Tags:    

Similar News