పదేళ్లకు కథలు రెడీ అంటున్న పూరి

Update: 2016-10-19 17:30 GMT
ఇజం కథ పదేళ్ల ముందే రాశాడట పూరి జగన్నాథ్. ఆయన దగ్గర తర్వాతి పదేళ్లకు సరిపడా కథలు రెడీగా ఉన్నాయట. టాలీవుడ్ స్టార్లందరితోనూ సినిమాలు చేసేశానని.. ఇక హాలీవుడ్ నటులతో కలిసి సినిమాలు చేయడమే తన లక్ష్యం అని అంటున్నాడు పూరి. ‘ఇజం’ ప్రమోషన్లలో భాగంగా ఇలాంటి అనేక విశేషాలపై మాట్లాడాడు పూరి. ఆయన ఏమన్నాడంటే..

‘‘ఇజం కథ పదేళ్ల కిందటే రాశా. ఇప్పుడు ఆ కథను బయటికి తీసి.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేశాను. అవినీతి అన్నది మన దేశంలో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నా కథ ఇప్పటికీ కాంటెంపరరీగా అనిపిస్తుంది. వికీ లీక్స్ అసాంజె స్ఫూర్తితో కథ అల్లుకున్నాను. కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘ఇజం’ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. ఈ సినిమాతో ఈ ఏడాది అన్ని రకాల అవార్డులూ కళ్యాణ్ రామే సొంతం చేసుకుంటాడు. అంత అద్భుతంగా నటించాడు ‘ఇజం’ సినిమాలో.

ఇక నా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. రాబోయే పదేళ్లకు సరిపడా కథలు నా దగ్గర ఉన్నాయి. నా కథలన్నీ సొసైటీ నుంచే పుడతాయి. నన్ను ఏదైనా అంశం ఎగ్జైట్ చేయగానే వెంటనే పేపర్ మీద పెట్టేస్తుంటా. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ పని చేశాను. ఇక తెలుగు స్టార్లను.. హాలీవుడ్ నటీనటుల్ని కలిపి క్రాస్ ఓవర్ సినిమాలు చేయాలన్నది నా తర్వాతి లక్ష్యం’’ అని పూరి చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News