జ్యోతిలక్ష్మి స్పెషల్‌: పూరి మార్కు ఫిలాసఫీ

Update: 2015-06-12 10:34 GMT
స్పీడ్‌ డైరెక్టర్‌ పూరి బ్యాంకాక్‌ ఎందుకు వెళ్తాడో! జనాలకు ఇప్పుడో క్లారిటీ వచ్చి ఉండాలి. ఆయన స్టడీయే వేరు. ఆయన కాన్సెప్టులే వేరు. ఎప్పుడూ రంజైన రామచిలకలు ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి? ఏమేమి చేస్తాయి? అన్న స్టడీ చేస్తే తనకి కావాల్సిన కమర్షియల్‌ పాయింట్లు బోలెడన్ని దొరికేస్తాయి. అలా దొరికిన ప్రతి పాయింటును తెలివిగా క్యాష్‌ చేసేసుకోవచ్చు.

అయితే అలాంటి కమర్షియల్‌ పాయింట్లు దొరికే ప్రదేశాలు ఏవి? అని వెతికితే.. విదేశీ బీచ్‌లు, గోవా బీచ్‌ల, పర్యాటక స్థలాలు, పోలీస్‌ స్టేషన్లు, మాఫియా, యాక్షన్‌ ఫ్యాక్షన్‌, వ్యభిచార గృహాలు, డ్రగ్స్‌ ముఠాలు.. ఇవన్నీ పూరీకి బాగా కనిపిస్తాయి. ఆ ప్యాషన్‌ వల్లే అతడు హార్ట్‌ ఎటాక్‌ లాంటి సినిమాకి ఇన్‌స్పయిర్‌ అయ్యాడు. బ్యాంకాక్‌లో ఉన్న తన ఇంట్లో కూచున్నప్పుడు బీచ్‌లో ఏం జరుగుతుందో ఫుల్లుగా చూసేస్తుంటాడు పూరీ. పైగా ఈసారి వేశ్యల కొంపలమీద కన్నేశాడు. అసలు వేశ్య ఎక్కడ పుడుతుంది? ఎందుకు పుడుతుంది? ఎలా పుడుతుంది? దీంట్లో సంఘం పాత్ర ఏమిటి? దగుల్బాజీల పోర్షన్‌ ఎంత? ఇవన్నీ స్టడీ చేసి తన సినిమాకి మెటీరియల్‌గా వాడుకున్నాడు. దేశవిదేశాల్లో వేశ్య గృహాల ఫార్ములాలన్నీ పక్కాగా తడిమేశాయి అతడి కళ్లు. అందుకే జ్యోతిలక్ష్మి అనే వేశ్య ఎలా పుట్టిందో ఎంచక్కా చెప్పాడు.

ఆడాళ్లు వేశ్యలు అయ్యేది మగాడు సరిగా లేకే అని చెప్పదలుచుకున్నాడు కానీ.. దానిని సరైన పంథాలో చెప్పడంలో విఫలమైపోయాడు. అంతా సినిమాటిక్‌ అనిపించింది తప్ప ఒరిజినాలిటీ కనిపించలేదెక్కడా. ఇక సారు దేవుడిని మరోసారి సవాల్‌ చేసిండ్రు. అది సంగతి.

Tags:    

Similar News