ఇడియట్ - పోకిరి - దేశముదురు లాంటి టైటిళ్లు పెట్టిన పూరి జగన్నాథ్.. ‘లోఫర్’ అనే టైటిల్ పెట్టడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ గురువు రామ్ గోపాల్ వర్మ లాంటి వాడే ఇలాంటి టైటిల్ వద్దనేయడంతో పునరాలోచనలో పడిపోయానని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథుడు. అందుకే టైటిల్ మార్చేస్తున్నానని.. త్వరలోనే ప్రకటిస్తానని చెప్పాడు.
ఐతే ఇంతలోనే పూరి - వరుణ్ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ పేరు ప్రచారంలోకి వచ్చింది. ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ అనేది పూరి సినిమా టైటిల్ అని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇది మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి టైటిల్ యాప్ట్ అనుకోవచ్చు. కానీ పూరి లాంటి డాషింగ్ డైరెక్టర్ ఇలాంటి టైటిల్ తో సినిమా చేస్తాడా అనేది డౌటు. ఇంతకముందు ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ కూడా సాఫ్ట్ టైటిలే కానీ.. అందులో ఓ వైవిధ్యం ఉంది. ఐతే ‘మా అమ్మా సీతామాలక్ష్మి’ అనే టైటిల్ అంటే మాస్ కు ఏమాత్రం ఎక్కకపోవచ్చు.
ఐతే పవన్ కళ్యాణ్ లాంటి వాడు ‘అత్తారింటికి దారేది’ టైటిల్ తో వచ్చి ఇండస్ట్రీ హిట్టు కొట్టినపుడు వరుణ్ - పూరిలకు వచ్చిన ఇబ్బంది ఏంటన్న అభిప్రాయమూ ఉంది. ఐతే ‘లోఫర్’ అనే టైటిల్ మార్చినా.. టైటిల్లో లోఫర్ అనే అర్థం వచ్చేలాగే పేరు ఉంటుందన్నాడు పూరి. మరి ఈ కొత్త టైటిల్ లో అలాంటిదేమీ లేదు. మరి ఈ టైటిలే కన్ఫమా కాదా చూడాలి.