తిట్టుని టైటిల్‌గా మార్చేసుకొని సినిమాలు తీయడం పూరి జగన్నాథ్ స్టైల్. ఇదివరకు ఇడియట్, పోకిరి, దేశముదురులాంటి తిట్లతో సినిమాలు తీసి విజయాలు అందుకొన్నాడు. ఇప్పుడు అదే తరహాలో వరుణ్‌తేజ్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకొన్నాడు. ఆ చిత్రానికి 'లోఫర్' అనే పేరును కూడా ఫిక్స్ చేశాడు. జులై 1న చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు.
మామూలుగా సినిమాకి పేరు ఫిక్స్ చేశాక... ఇక అన్ని చోట్లా ఆ పేరునే వాడేస్తుంటాడు. అయితే సినిమా ఓపెనింగ్‌కి సంబంధించిన పోస్టర్ల డిజైన్‌లో మాత్రం పేరు కనిపించడం లేదు. ఆన్లైన్లో పేరు లేకుండానే డిజైన్లు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి 'లోఫర్' అనే పేరుపై చిత్రబృందం పునరాలోచిస్తుండొచ్చని ఫిల్మ్‌నగర్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. పూరి జగన్నాథ్ లోఫర్ అనే పేరు ప్రకటించగానే మెగాభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్టు తెలిసింది. టైటిల్ మరీ చీప్‌గా ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. మరి పూరి టైటిల్‌పై వెనక్కి తగ్గాడా లేక అదే పేరునే ఫిక్స్ చేస్తాడో చూడాలి.