ఒకప్పుడు టాప్ డైరెక్టర్ ఛైర్ లో ధిలాసాగా కూర్చున్న పూరీ జగన్నాధ్.. ఇప్పుడు తన సినిమాకు హీరోను వెతుక్కోవడమే కష్టం అయిపోతోంది. గతంలో పూరీతో సినిమా కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తే.. ఇప్పుడు చిన్నపాటి హీరోలు కూడా మొహం చాటేస్తున్నారు.
వరుసగా సినిమాలు నిరుత్సాహపరచడం మాత్రమే కాదు.. కంటెంట్ పరంగా కూడా తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి టెంప్లేట్ నే పట్టుకుని వేళ్లాడడాన్ని హీరోలే కాదు.. జనాలు కూడా మెచ్చలేకపోయారు. కొందరితో తిరస్కారం ఫేస్ చేసిన పూరీ.. తన కొడుకునే హీరో చేసేసి మెహబూబా తీసేశాడు. ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరూ రారనే విషయంపై పూరీకి ముందే క్లారిటీ ఉంది. అందుకే తనే ఈ చిత్రాన్ని నిర్మించేశాడు. దాదాపుగా ఈ సినిమాకు 20 కోట్ల బడ్జెట్ అయిందని టాక్. కానీ ఫుల్ రన్ లో 3-4 కోట్ల మధ్యే ఈ సినిమా వసూళ్లు ఆగిపోయే పరిస్థితి. కథ విషయంలో బాగానే సెటప్ చేసినా.. కథనం కొత్తగా ప్రయత్నించినా.. అది పూరీకి మాత్రమే కొత్త.. జనాలకు మాత్రం అరిగిపోయిన కంటెంట్ కావడంతో ఆదరణ దక్కలేదు.
మెహబూబా కలెక్షన్స్ ను పెంచేందుకు పూరీ టీం ఇంకా ట్రై చేస్తోంది కానీ.. అవి వర్కవుట్ కావడం కష్టమే అనే సంగతి ఒప్పుకోవాలి. ఇప్పుడు నిర్మాతగా డబ్బులు కోల్పోవడమే కాదు.. దర్శకుడిగా కూడా మరో మెట్టు కిందికి దిగిపోయాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇలాంటి పరిస్థితిలో ఏ హీరోను తను కథతో ఒప్పించాలన్నా క్లిష్టమైన విషయమే. మెహబూబాపై 60 శాతం వరకూ నష్టాలను ఫేస్ చేయాల్సి రావడంతో.. ఇప్పుడు నిర్మాతగా కూడా స్టెప్ తీసుకోవడం కష్టం. మరి ఇప్పుడు పూరీ నెక్ట్స్ స్టెప్ ఏంటి.. ఏ హీరోను ఒప్పించగలుగుతాడు అని ఇండస్ట్రీ జనాలతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.