మరి 'రోగ్‌' అటకెక్కినట్లేనా సారూ??

Update: 2016-05-31 19:30 GMT
కళ్యాణ్‌ రామ్‌ కొత్త లుక్‌ తో షాకిచ్చాడు పూరి జగన్‌. నిజానికి స్ర్టయిట్‌ హెయిర్‌ లుక్‌ గతంలో కళ్యాణ్‌ రామ్‌ ఆల్రెడీ ప్రయత్నించాడు కాని.. ఆ లుక్కుతో క్లిక్కవ్వలేదు. అయితే ఈ లుక్కు సంగతి సరే.. అసలు పూరి బాబు మొన్నటివరకు బ్యాంకాక్‌ లో చెక్కిన ఆ ఆణిముత్యం ఏమైంది?

ఒక కొత్త హీరోను పరిచయం చేస్తూ.. పూరి జగన్‌ బ్యాంకాక్‌ లో ''రోగ్‌'' అనే సినిమాను చిత్రీకరించాడు. ఈ సినిమా బ్యాంకాక్‌ షెడ్యూల్ అనేక మలుపులు తిరిగింది. కొన్ని రోజులు అమైరా దస్తూర్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆమె హ్యాండివ్వడంతో అయేషా శర్మ ను పెట్టి షూట్‌ చేశారు. కాని మొదటి షెడ్యూల్‌ అయిపోయాక ఆమె కూడా తప్పుకుంది. అప్పుడు ప్రియాంక చోప్రా కజిన్‌బర్బీ హండి ఎలియాస్‌ మన్నారా చోప్రా లైన్లోకి వచ్చింది. ఇంతకీ ఆ రోగ్‌ కి ఏమైంది. ఈరోజు నుండి పూరి జగన్‌ ఆల్రెడీ కళ్యాణ్‌ రామ్‌ సినిమా షూటింగ్‌ ను మొదలెట్టేశాడు. గతంలో కేవలం తన సినిమా విడుదలయ్యాకనే మరో సినిమా మొదలెట్టే ఈ డాషింగ్‌ డైరక్టర్‌.. ఇప్పుడు ఆ సినిమా మధ్యలో ఉండగానే ఇలా చేస్తున్నాడేంటో.

మొన్నటివరకు రోగ్‌ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్‌ అవుతుంది అనుకున్నారు జనాలు. చివరకు కళ్యాణ్‌ రామ్‌ న్యూ లుక్‌ ఎలా ఉందో బయటకు వచ్చింది కాని.. ఇంతవరకు రోగ్‌ లుక్కు మాత్రం పూరి ఆఫీస్‌ కే పరిమితమైంది. వాట్ సే పూరి సారూ??
Tags:    

Similar News