దర్శకుడు పూరీ జగన్నాధ్ తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసేశాడు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణతో పైసా వసూల్ తీసి డిజప్పాయింట్ చేసిన పూరీ.. తన కుమారుడు ఆకాష్ తో సినిమా చేయనున్నాడనే విషయంపై అంచనాలున్నాయి. తన 33వ సినిమాను ఇవాళ అనౌన్స్ చేస్తానంటూ నిన్నటి నుంచి ఊరిస్తున్న ఈ దర్శకుడు.. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా.. స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసేశాడు.
పూరీ కొత్త సినిమా పేరు 'మెహబూబా'. హీరో ఎవరో కాదు.. పూరీ కుమారుడు ఆకాష్. హీరోయిన్ గా మంగళూర్ భామ నేహా శెట్టి నటించబోతోంది. గతంలో ఈమెకు ఓ కన్నడ సినిమా చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది. అయితే.. ఈ మెహబూబా చిత్రం విషయంలో పూరీ కొత్త స్టైల్ పాటించబోతున్నాడు. తన రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగా కాకుండా.. ఓ పీరియాడిక్ ఫిలింను ఎంచుకోవడం ఆశ్చర్యకరమే. "మెహబూబా స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత.. నేను హై ఇంటెన్స్ తో పాటు.. చాలా డెప్త్ ఉన్న లవ్ స్టోరీ ని చేయబోతున్నానని అర్ధమైంది. నేను సహజంగా చేసే సినిమాలకు ఇది పూర్తిగా విరుద్ధం. 1971 ఇండో-పాక్ వార్ ఆధారంగా ఈ చిత్ర కథ సాగుతుంది" అని చెప్పాడు పూరీ.
ఆకాష్ తన రక్త సంబంధమే అయినా.. సినిమాల్లో హీరోగా రాణించాలనే ఆతని కసి కారణంగానే.. కొడుకును హీరోగా తీసుకున్నట్లు చెప్పిన పూరీ.. సంగీత బాధ్యతలు సందీప్ చౌతాకు ఇచ్చానని చెప్పాడు. హిమాచల్ ప్రదేశ్.. పంజాబ్.. రాజస్థాన్ రాష్ట్రాలలోని అందమైన లొకేషన్స్ లో మెహబూబా షూటింగ్ ఉంటుందట.