పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ప్రతీ సినిమా మ్యూజికల్ హిట్టే. `బద్రీ` నుంచి `ఇస్మార్ట్ శంకర్` వరకు ప్రతీ ఆడియో చార్ట్ బస్టర్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. పోకిరి, బద్రీ, ఇడియట్, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం.. ఇలా చాలా సినిమాల్లోని పాటులు యువతని ఉర్రూతలూగించాయి. ఏ చికిత్తా అంటూ పవన్ బద్రీలో చేసిన సాంగ్ హంగామా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అయితే ఆ మ్యాజిక్ ని కంటిన్యూ చేయడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ పూర్తిగా విఫలమయ్యాడు.
సరైనా సాంగ్స్, సీన్స్ ని ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ `లైగర్`లో ఏ కోణంలోనూ కనిపించలేదు. ముందు నుంచి ఈ మూవీకి మ్యూజిక్ ఎవరన్నది పజిల్ గా మారింది. చివర్లో సాంగ్స్ కు బాలీవుడ్ కు చెందిన కొంత మంది సంగీతం అందించారని తెలిసి ఫ్యాన్స్ షాకయ్యారు. విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ అంటే మ్యూజిక్ పై, మ్యూజిక్ డైరెక్టర్ పై ప్రత్యేక ఆసక్తి వుంటుంది.
అది పూరిలో ఎక్కడా కనిపించకపోవడం విచారకణం. అదే `లైగర్`కు ప్రధాన మైనస్ గా మారిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ముందు ఈ మూవీని మణిశర్మనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేశారు. తను వర్క్ చేయడం కూడా మొదలు పెట్టాడు. తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి మణిశర్మ కామ్ గా తప్పుకున్నారు. తను లేకపోతే ఆయన స్థానంలో లైగర్ కు సంగీతం అందించేది ఎవరనే చర్చ నడిచింది.
బాలీవుడ్ కు చెందిన కొంత మంది పాప్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీకి ఫైనల్ గా సాంగ్స్ అందించారు. దీంతో టోటల్ గా తెలుగు సోల్ పాటల్లో కరువైంది. రెండు మూడు పాటలు మినహా ఏవీ పెద్దగా వనాలని, వినిపించేవిగా ట్రెండ్ కాలేకపోయాయి.
ఇక నేపథ్య సంగీతం కోసం సునీల్ కశ్యప్ ని రంగంలోకి దించారు. తను ఈ మూవీకి ప్రధాన మైనస్ గా మారాడు. ఎంఎంఏ ఫైట్స్ సందర్బంలో కానీ ఇతర సన్ని వేశాల్లో కానీ సీన్స్ ని సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం ఎలివేట్ చేయలేక పోయింది.
అదే అతని స్థానంలో మణిశర్మ వుండి వుంటే కథ వేరుగా వుండేది. మణిశర్మ రిరికార్డింగ్ విషయంలో మాస్టర్ అని పేరుంది. అలాంటి మణిశర్మని పక్కన పెట్టి పూరి ఆడిన గేమ్ మొదటికే మోసం గా మారిందని, అది సినిమాకు ప్రధాన మైనస్ గా మారడమే కాకుండా కథ, కథనాల్లో తమ్ములేదని స్పష్టం బయటపడేలా చేసిందని పలువురు కామెంట్ లు చేస్తున్నారు.