రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన 'RRR', ప్రశాంత్ నీల్ రూపొందించిన పీరియడికల్ కల్ట్ ఫిక్షన్ 'కేజీఎఫ్ 2' సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టాయి. 'RRR' భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కి రూ. 1150 కోట్ల మేర ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లని రాబట్టగా.. వన్ మ్యాన్ ఆర్మీగా వచ్చిన యష్ 'కేజీఎఫ్ 2' దాదాపు రూ. 1200 కోట్ల వసూళ్లని రాబట్టి విస్మయ పరిచింది.
ఈ రెండు చిత్రాలు సాధించిన వసూళ్లతో ట్రేడ్ వర్గాల్లో , మేకర్స్ లో కొత్త చర్చమొదలైంది. మేకింగ్ విషయంలోనూ బడ్జెట్ విషయంలోనూ మరిన్ని మార్పులొచ్చాయి. మారిని ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథల్లో, బడ్జెట్ లోనూ మార్పులు చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇదే తరహాలో 'పుష్ప 2' మేకింగ్, టేకింగ్ తో పాటు బడ్జెట్ విషయంలోనూ సుకుమార్, బన్నీ తమ ఆలోచనా విధాన్ని మార్చుకున్నారు.
గత ఏడాది డిసెంబర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పుష్ప'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మైత్రీ మూవీమేకర్స్, ముత్యం శెట్టి మీడియా ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య .. కొంత హడావిడిగా విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. అయితే ఉత్తరాదిలో మాత్రం ఈ మూవీకి పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. అయినా సరే అక్కడ రూ. 100 కోట్లని రాబట్టి సంచలనం సృష్టించింది.
వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో ఈ మూవీ 360 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి దర్‌శకనిర్మాతల్లో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా చేసింది. బడ్జెట్, భారీ కాన్వాస్.. అంతకు మించిన పబ్లిసిటీ, కంటెంట్ తో 'పుష్ప 2'ని తెరపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
పార్ట్ 1 ని మించి పార్ట్ 2 కు దాదాపు 400 కోట్ల మేర బడ్జెట్ ని కేటాయించారు. ఫస్ట్ పార్ట్ ని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేసిన కోవిడ్ కారణంగా కుదరకపోవడంతో షూట్ మొత్తం ఇండియాలోనే పూర్తి చేశారు. అయితే పార్ట్ 2 ని మాత్రం విదేశాల్లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇండో నేషియా , సింగపూర్ లలో కీలక ఘట్టాల షూటింగ్ ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్ 2 లో గంధపు చెక్కల స్మగ్లింగ్ కి ఏషియాలో మెయిన్ కింగ్ పిన్ గా బన్నీ కనిపించబోతున్నారని, స్టోరీ స్పాన్ ని కూడా భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ మూవీ రేంజ్ లో పెంచినట్టుగా చెబుతున్నారు. విజువల్స్ కూడా అబ్బుర పరిచే స్థాయిలో వుంటాయని, ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడిని సైతం స్పెల్ బౌండ్ చేసేలా వుండనున్నాయని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెల లేదా ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.