చిత్రం : 'పుష్ప'
నటీనటులు: అల్లు అర్జున్-రష్మిక మందన్న-ఫాహద్ ఫాజిల్-సునీల్-అజయ్ ఘోష్-ధనంజయ-జగదీష్-అజయ్-అనసూయ-బ్రహ్మాజీ-దివ్య శ్రీపాద తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: మిరస్లోవ్ కూబా
మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాతలు: రవిశంకర్-నవీన్ ఎర్నేని
రచన-దర్శకత్వం: సుకుమార్
అల్లు అర్జున్-సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఉత్కంఠకు తెర దించుతూ ఈ రోజే థియేటర్లలోకి దిగిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
పుష్పరాజ్ అలియాస్ పుష్ప (అల్లు అర్జున్) చిత్తూరు జిల్లాలో ఒక పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. తన తల్లిని తండ్రి అధికారికంగా పెళ్లి చేసుకోకపోవడం.. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తనకంటూ ఒక ఇంటి పేరు లేక.. ఆదరువు లేక అతను అవమానాల పాలవుతుంటాడు. డబ్బు సంపాదిస్తేనే సమాజంలో తనకొక గుర్తింపు వస్తుందని అందుకోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిన అతను.. ఎర్రచందనం చెట్లు నరికే కూలీగా మారతాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు పైకెక్కుతూ స్మగ్లర్ అవతారం ఎత్తుతాడు. అయినా అతడికి సంతృప్తి ఉండదు. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నే చేజిక్కించుకోవడానికి ప్రణాళిక రచిస్తాడు. ఐతే పుష్ప ఒక్కో మెట్టు ఎక్కేకొద్దీ అతడికి శత్రువులు కూడా పెరుగుతారు. వారిని దాటి పుష్ప తాను అనుకున్న లక్ష్యాన్ని ఏమేరకు చేరుకున్నాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
క్లాసిక్స్ తీయాలని తీస్తే అవి క్లాసిక్స్ అవ్వవు. అలాగే ఒక క్లాసిక్ ను అనుకరించే ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. అందరూ వెళ్తున్న దారికి భిన్నంగా ఒక ప్రయత్నం మొదలుపెట్టి.. మనసు పెట్టి చేస్తే ఆ ప్రయత్నం గొప్ప ఫలితాన్నందుకుంటుంది. మళ్లీ అదే దారిలో వెళ్తే మాత్రం ఏముంది ఇందులో కొత్త అనిపిస్తుంది. సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా మొదలుపెట్టినపుడు అదొక క్లాసిక్ అవుతుందని.. అంతగా ప్రేక్షకాదరణ పొందుతుందని ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఆయన తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి.. తన శైలికి భిన్నంగా.. మనసుపెట్టి ఓ ప్రయత్నం చేస్తే అది అద్భుత ఆదరణ దక్కించుకుని.. బోనస్ గా ‘క్లాసిక్’ స్టేటస్ కూడా అందుకుంది.
ఐతే సుకుమార్ కొత్త సినిమా ‘పుష్ప’ ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి ఏ ప్రోమో చూసినా అందులో ‘రంగస్థలం’ ఛాయలే కనిపించాయి. సుకుమార్ ఇంకో ‘రంగస్థలం’ తీయాలన్న ఆలోచనతోనే ‘పుష్ప’ మొదలుపెట్టాడో లేదో కానీ.. ప్రేక్షకులు మాత్రం అలాంటి సినిమానే చూడబోతున్నామని బలంగా ఫిక్సయిపోయారు. కానీ ముందే అన్నట్లు ట్రెండుకు భిన్నంగా తీసిన ఓ సినిమా ఒక కొత్త అనుభూతిని కలిగించాక.. అదే తరహాలో ఇంకో సినిమా వస్తే ఏముంది కొత్త అనిపిస్తుంది. అలాగే ముందొచ్చిన సినిమాతో పోలికా దీనికి ప్రతికూలంగా మారుతుంది. ఈ కోణంలో చూస్తే కచ్చితంగా ‘పుష్ప’ నిరాశ కలిగించే సినిమానే.
కానీ హీరో క్యారెక్టరైజేషన్ సహా అన్నింట్లోనూ రస్టిక్ ఫీల్ తో ‘రంగస్థలం’కు దగ్గరగా అనిపించినప్పటికీ.. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఎప్పుడూ చూడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథాకథనాల్ని ఒక దశ వరకు రసవత్తరంగా నడపడం ద్వారా సుకుమార్ ప్రేక్షకుడి డబ్బులకు బాగానే గిట్టుబాటు చేస్తాడు. ఇక మాస్ మెచ్చే ఎలివేషన్ సీన్లకు ఇందులో లోటే లేదు. హీరో క్యారెక్టర్.. అందులో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అదిరిపోవడంతో ‘పుష్ఫ’ ఈ రకంగానూ పైసా వసూల్ అనిపిస్తుంది.
కానీ లెక్కపెట్టుకోవడానికి చాలామంది విలన్లున్నప్పటికీ హీరో స్థాయికి తగ్గట్లుగా అతణ్ని బలంగా ఢీకొట్టే.. అతడికి సవాలు విసిరే బలమైన ప్రతినాయకుడు లేకపోవడం ‘పుష్ప: ది రైజ్’లో పెద్ద మైనస్. ఎప్పుడూ విలన్ పాత్రల్ని హీరోకు దీటుగా తీర్చిదిద్దే సుకుమార్.. ఈసారి మాత్రం ఈ విషయంలో ఫెయిలయ్యాడు. బన్నీ మీద తనకున్న ప్రేమంతా ఈ సినిమాలో కనిపిస్తుందని చెప్పిన సుక్కు.. తన ప్రేమనంతా బన్నీకే పంచేసి విలన్ల మీదే శీతకన్నేసినట్లున్నాడు. విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుందని.. హీరో గట్టి సవాళ్లను దాటి ముందుకెళ్తేనే అతడి పాత్ర ప్రభావం ప్రేక్షకులపై అంత బలంగా పడుతుందనే ప్రాథమిక సూత్రాలను సుకుమార్ మరిచిపోయాడేమో అనిపిస్తుంది. ఈ కోణంలో చూస్తే ఆయన బలహీన చిత్రాల్లో ఒకటిగా ‘పుష్ప’ నిలుస్తుంది.
‘పుష్ప’లో హీరో ప్రయాణం ఒక ఫ్యాక్టరీలో కూలీగా మొదలవుతుంది. యజమాని వస్తే కాలు మీద కాలేసుకుని కూర్చుని టీ తాగూతూ కనిపిస్తాడు హీరో. ఓనర్ వస్తే ఇదేనా మర్యాద అంటే.. తన కూలిలోంచి వంద రూపాయలిచ్చి మర్యాద కొనుక్కోమని చెప్పి ఆ పని వదిలేస్తాడు. ఇదెంత ఇల్లాజికల్ గా అనిపించినప్పటికీ.. హీరో ఎలివేషన్ ఆమాత్రం ఉండాలని సరిపెట్టుకుంటాం. కానీ అక్కడి నుంచి బయటపడి మామూలు పని చేస్తే వచ్చే దాంతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ కూలి వస్తుందని ఎర్రచందనం చెట్లను కొట్టే పనికి పోయే హీరో.. తొలి రోజు మామూలు కూలీగా అడుగు పెట్టి.. అప్పటికప్పుడు ఆ కూలీలందరికీ బాస్ అయిపోతాడు.
పోలీసులొస్తే కొమ్ములు తిరిగిన స్మగ్లర్ లాగా వాళ్లను డీల్ చేస్తాడు. ఎర్రచందనం లారీని వారికి దారి మళ్లించి స్మగ్లర్ల నుంచి వాటా కూడా తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ మొత్తంలో హీరో పాత్రకిచ్చిన మాస్ ఎలివేషన్లు ఆహా ఓహో అనిపించినా.. సుకుమార్ మార్కు ఇంటలిజెంట్ క్యారెక్టర్ బిల్డప్ మాత్రం కనిపించదు. ఈ సీన్లు చూసినపుడే హీరోకు ఎక్కడా ఎదురన్నదే ఉండదని.. సినిమా అంతా అతడిదే ఆధిపత్యమని.. అతడి ముందు ఎవ్వరూ నిలవజాలరని అర్థమైపోతుంది. ఆ అంచనాలకు తగ్గట్లే చివరి వరకు హీరో ‘తగ్గేదేలే..’ అనుకుంటూ వీర లెవెల్లో రెచ్చిపోయి అందరితో చెడుగుడు ఆడేస్తాడు.
ఐతే విలన్లెంత వీక్ గా ఉన్నా సరే.. పుష్ప కూలీగా మొదలుపెట్టి సొంతంగా ఎర్రచందనం స్మగ్లర్ గా ఎదిగే క్రమాన్ని చాలా ఎగ్జైటింగ్ గా.. మాస్ మెచ్చేలా తీర్చిదిద్దాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ నడిచే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్తగా.. ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి. పోలీసులను బురిడీ కొట్టించి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే సీన్లు ప్రథమార్ధానికి ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముంగిట వెయ్యి టన్నుల చందనం మళ్లించే భారీ సన్నివేశం సినిమా మొత్తానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దానికి కొనసాగింపుగా తనకు ఎదురెళ్లిన వ్యక్తిని మంగళం శీను మట్టు బెడుతున్నపుడే అతడి ఇంటికి వెళ్లి తనకు హీరో ఝలక్ ఇచ్చి తన సత్తా ఏంటో చూపించే సీన్ మాస్ కు పూనకాలు తెప్పించేస్తుంది.
ఇక్కడ ‘పుష్ఫ’ ఇచ్చే హై మామూలుగా ఉండదు. ఇక్కడున్న టెంపోను కనుక ద్వితీయార్ధంలో కొనసాగించి ఉంటే ‘పుష్ఫ’ రేంజే వేరుగా ఉండేది. కానీ సెకండాఫ్ లో కథ పరంగానూ పెద్దగా మెరుపుల్లేవు. అలాగే ప్రథమార్ధంలో మాదిరి ఎలివేషన్ సీన్లూ లేవు. పుష్పను చంపడానికి ప్రయత్నించే ఎపిసోడ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మినహాయిస్తే ద్వితీయార్ధంలో ప్రత్యేకంగా అనిపించే విషయాలేమీ లేవు.
ఇంటర్వెల్ సమయానికే హీరో చాలా ఎదిగిపోయి ఉంటాడు. సెకండాఫ్ లో ఇంకో మెట్టు ఎక్కుతాడంతే. ఆ మధ్యలో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. హీరోయిన్ తో ముడిపడ్డ సన్నివేశాలు సాగతీతగా అనిపించి ‘పుష్ప’ మీద ఇంప్రెషన్ ను పోగొడతాయి. ఒక రొమాంటిక్ సీన్ అయితే.. ఎడిటింగ్ టేబుల్ ను దాటి ఎలా ఫైనల్ కట్ లోకి వచ్చిందో అర్థం కాదు. కనీసం ‘ఊ అంటావా మావా..’ పాటనైనా సెకండాఫ్ కోసం దాచుకోవాల్సింది. కానీ అది కూడా ప్రథమార్ధ:లోనే పడిపోవడంతో ద్వితీయార్ధంలో మెరుపులు మరీ తగ్గిపోయాయి. ప్రిక్లైమాక్స్ దగ్గర బాగా డౌన్ అయ్యే ‘పుష్ప’ చివర్లో ఫాహద్ ఫాజిల్ రంగప్రవేశంతో కానీ.. మళ్లీ పుంజుకోదు. ఫాహద్ స్థాయికి తగ్గట్లుగా తన పాత్రను ఆసక్తికరంగా మొదలుపెట్టి.. హీరోతో మంచి కన్ఫ్రంటేషన్ సీన్ పెట్టి సినిమాకు మంచి ముగింపునిచ్చాడు సుకుమార్. ఈ సినిమా కథలో అత్యంత కీలకమైన పాయింట్ అయిన ‘ఇంటి పేరు’ చుట్టూ క్లైమాక్స్ ను నడిపించిన వైనం ఆకట్టుకుంటుంది.
‘పుష్ప: ది రూల్’కు లీడ్ గా చేసిన పతాక సన్నివేశాలు సుకుమార్ మార్కును చూపిస్తాయి. కానీ అంతకుముందు మాత్రం ‘పుష్ప’ జోరు బాగా పడిపోయింది. ప్రథమార్ధంలో ఉన్న టెంపో ద్వితీయార్ధంలో కొనసాగకపోవడం ‘పుష్ప’కున్న ప్రతికూలత. ముందున్న ఊపు కొనసాగకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరాశతోనే థియేటర్ల నుంచి బయటికి వస్తారు. ఐతే అంచనాలకు కొంత దూరంలో ఆగిపోయినా సరే.. ఒకసారి చూడ్డానికి ఢోకాలేని సినిమానే ‘పుష్ప’.
నటీనటులు:
నిస్సందేహం గా ‘పుష్ప’లో అల్లు అర్జున్ ది వన్ మ్యాన్ షో. కెరీర్లో ది బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చాడతను. పుష్ప పాత్రను అతను తప్ప ఇంకెవరూ ఇంత బాగా చేయలేరేమో అనిపించేలా ఆ పాత్రకు ప్రాణం పోశాడు. క్యారెక్టర్ కోసం అవతారం మార్చుకుని.. సరికొత్త బాడీ లాంగ్వేజ్ చూపించడమే కాదు.. చిత్తూరు యాసలో అథెంటిగ్గా డైలాగులు చెప్పడం ద్వారా బన్నీ తన కమిట్మెంట్ ను చాటి చెప్పాడు. పుష్ప పాత్రలో అతడి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ కొన్ని రోజుల పాటు ప్రేక్షకులను వెంటాడుతుందనడంలో సందేహం లేదు. హీరోయిన్ రష్మిక మందన్న కూడా బాగానే కష్టపడ్డట్లు అనిపించినా.. తన పాత్ర అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు.
ఓవరాల్ గా తన అప్పీయరెన్స్.. పెర్ఫామెన్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలన్ పాత్రధారులందరి లోకి కొండారెడ్డిగా అజయ్ ఘోష్ నటన ఎక్కువ ఆకట్టుకుంటుంది. మంగళం శీనుగా సునీల్ లుక్ భిన్నంగా అనిపించినా.. ఆ పాత్రలో ఉండాల్సినంత బలం లేదు. కొన్నిసార్లు అతనీ పాత్రకు మిస్ ఫిట్ అనిపిస్తుంది. అనసూయ కూడా పెద్దగా ఇంపాక్ట్ వేయలేదు. జాలి రెడ్డిగా ధనంజయ పర్వాలేదు. హీరో స్నేహితుడిగా చేసిన ‘పలాస’ ఫేమ్ జగదీష్ చాలా బాగా చేశాడు. హీరో తర్వాత బెస్ట్ పెర్ఫామెన్స్ అంటే అతడిదే. ఫాహద్ ఫాజిల్ కనిపించిన కాసేపట్లోనే తన ప్రత్యేకత ను చాటుకున్నాడు. సెకండ్ పార్ట్ మీద ఆసక్తి రేకెత్తించేది అతనే. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘పుష్ప’ అనుకున్నంత స్థాయిలో లేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఓకే అనిపించినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొంత నిరాశ పరిచాడు. అనుకున్నంతగా సన్నివేశాలను ఎలివేట్ చేయలేకపోయాడు. సినిమాటోగ్రాఫర్ మిరస్లోవ్ కూబా పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో విజువల్స్ బాగున్నాయి. ఐతే డీఐ సరిగా చేయకపోవడం వల్లో ఏమో సినిమాటోగ్రాఫర్ పడ్డ కష్టానికి తగ్గ విజువల్ క్వాలిటీ సినిమాలో కనిపించలేదు. అలాగే హడావుడి డబ్బింగ్.. ప్రి ప్రొడక్షన్ ప్రభావం కచ్చితంగా సినిమాపై పడింది. రసూల్ పొకుట్టి లాంటి ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్ చేతుల్లో సినిమాను పెట్టినా సౌండ్ డిజైన్ అనుకున్నంత స్థాయి లో లేకపోవడానికి హడావుడే కారణం కావచ్చు.
నిర్మాతలు చాలా ఖర్చు పెట్టినా అందుకు తగ్గ క్వాలిటీ తెర పై కనిపించకపోవడం కూడా గమనార్హం. రైటర్ కమ్ డైరెక్టర్ సుకుమార్ ఓవరాల్ గా తన స్థాయికి తగ్గ సినిమా తీయలేదనిపిస్తుంది. కానీ ఆయన మార్కు కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. ప్రథమార్ధం వరకు ఆయన సినిమాను మంచి టెంపోతో నడిపించారు. హీరో పాత్రను బాగా ఎలివేట్ చేయగలిగారు. కానీ సెకండాఫ్ లో మాత్రం సుక్కు మార్కు మిస్ అయింది. స్క్రీన్ ప్లేలోనూ ఎలాంటి వైవిధ్యం చూపించలేకపోయారు. ‘పుష్ప: ది రూల్’ లో మాత్రం సుక్కు తన ప్రమాణాలను అందుకోవాల్సిందే
చివరగా: పుష్ప.. పైకి లేచి కాస్త తగ్గాడు
రేటింగ్-2.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre