క్లిక్‌ క్లిక్ : జక్కన్న గణేష్‌ లే కాదు.. 'పుష్ప' గణేష్ కూడా వచ్చాడోచ్‌

Update: 2022-08-30 15:30 GMT
ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్‌ స్టార్ హీరోల సూపర్‌ హిట్‌ సినిమాల్లోని పాత్రల్లో గణేష్ లను తయారు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ గణేష్ ని మొదలుకుని బాహుబలి గణేష్ వరకు ఎంతో మంది హీరోల పాత్రల గణేష్ లు వచ్చారు. ఈ ఏడాది ఎక్కువ శాతం టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్ సందడి కనిపిస్తోంది.

అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీమ్‌ పాత్రల్లో నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క రూపంలో ఔట్ ఫిట్ లో గణేష్ విగ్రహాలను తయారు చేసిన విషయం తెల్సిందే.

కేవలం ఆర్ ఆర్‌ ఆర్‌ హీరోల గణేష్ ప్రతిమలే కాకుండా కొన్ని చోట్ల అల్లు అర్జున్‌ పుష్ప సినిమా యొక్క గణేష్ ప్రతిమలు కూడా కనిపిస్తున్నాయి.

గణేశుడు పుష్ప గెటప్ లో ఎర్ర చందనం దుంగలపై కూర్చుని తగ్గేదే లే అన్నట్లుగా ఫోజ్‌ ఇచ్చిన ప్రతిమలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తెల్లటి డ్రస్ లో గణేష్‌ ప్రతిమను పుష్ప బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ విగ్రహం ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులను మాత్రమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పుష్ప సినిమా గత ఏడాది చివర్లో విడుదల అయ్యి ఏకంగా నాలుగు వందల కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుకుమార్‌ కాస్త ఎక్కువ సమయం ను తీసుకుని పుష్ప 2 కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడు. బాలీవుడ్‌ స్టార్స్ ఈ సినిమాలో నటింపజేయబోతున్నాడు. ఇటీవలే పుష్ప 2 సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News