ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కించుకున్న అల్లు అర్జున్ తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు ఏడాది క్రితమే ఓకే చెప్పాడు. గత ఏడాదిలోనే సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా అనేక కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం అల వైకుంఠపురంలో మరియు పుష్ప సినిమాలను సమాంతరంగా బన్నీ చేయాలనుకున్నాడు. కాని పరిస్థితులు అనుకూలించలేదు. అల వైకుంఠపురంలో సినిమా పూర్తి అయిన తర్వాత పుష్పను మొదలు పెట్టాలని భావించినప్పటికి సాధ్యం కాలేదు. ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా ఏడు నెలలుగా వాయిదా పడుతూనే ఉంది. గత నెలలో మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కేరళ అడవులకు వెళ్లేందుకు అంతా సిద్దం అయిన సమయంలో కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాను గత నెలలో వికారాబాద్ అడవుల్లో పునః ప్రారంభించాలని భావించారు. ఏకంగా అడవి సెట్ వేయబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కాని చివరకు కేరళ అడవుల్లోనే ఈ నెల నుండి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్ కు యూనిట్ సభ్యులు లీక్ ఇచ్చారు. ఈసారి మరేదో కారణం వల్ల సినిమాను మొదలు పెట్టడం లేదు. మరో నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
వచ్చే నెల నుండి కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిపేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లుగా బన్నీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో వాతావరణం అనుకూలించక పోవడం వల్లే నెల రోజులు ఆలస్యంగా సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ నెలలో కూడా పుష్ప సినిమా షూటింగ్ లేనట్లే అంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా కూడా ఏకధాటిగా షూటింగ్ జరిపి తక్కువ సమయంలో షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.