క్రిస్మస్ బరిలో రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ మిడిల్ లో వస్తున్న ఈ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కి సరికొత్త కళను తెస్తాయని పరిశ్రమ నమ్ముతోంది. ఇటీవలి కాలంలో కరోనా క్రైసిస్ కొనసాగుతున్నా భయాల్ని విడిచి తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇది నిజంగా శుభ పరిణామం. ఇక థర్డ్ వేవ్ భయాలు కూడా ఎవరిలోనూ లేవు. అదే క్రమంలో పుష్ప చిత్రాన్ని డిసెంబర్ లో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు అల్లు వర్గాలు మైత్రి తో కలిసి రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా కేటగిరీలో ఈ చిత్రాన్ని హిందీ సహా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
పుష్ప రిలీజ్ తేదీ ఇదీ అని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా అంటూ తొలుత ప్రకటించి ఆ తరవాత 17 డిసెంబర్ ఫిక్స్ అని ప్రకటించారు. అయితే డిసెంబర్ 17 లేదా 24న పుష్ప వస్తోందనే గుసగుసలు తాజాగా వినిపిస్తున్నాయి. అలాగే పుష్పతో పాటే అల్లు కాంపౌండ్ నుంచి వరుణ్ తేజ్ గని విడుదల కూడా ఇదే సీజన్ లో ఉంది. డిసెంబర్ 24న గని చిత్రం ప్రతిష్ఠాత్మకంగా వస్తోంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్ వారసుడు అల్లు బాబి ఒక నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా రెండు కీలకమైన తేదీల్ని అల్లు వారు బ్లాక్ చేయడం చర్చనీయాంశమైంది. రెండు తేదీలు అల్లు వారి వద్దనే ఉండాలనే ఉద్ధేశం వెనక కారణమేమిటీ? అంటూ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు.
రెండు తేదీల్ని లాక్ చేసి పెడితే తమ సినిమాల్ని అవసరాన్ని బట్టి రిలీజ్ తేదీల్ని అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటును కూడా ప్లాన్ చేశారేమో అన్న ముచ్చటా సాగుతోంది. పుష్ప చిత్రం అడవులు గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుండగా .. గని దానికి పూర్తి కాంట్రాస్ట్ గా బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలపైనా మెగా - అల్లు ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.