ట్రెండీ టాక్‌: త‌గ్గేదే లే..! పుష్ప టార్గెట్ RRR..?

Update: 2021-08-07 04:30 GMT
ప్ర‌స్తుతం పాన్ ఇండియా వార్ సౌత్ లో పీక్స్ కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి 1 .. బాహుబ‌లి 2.. సాహో చిత్రాల‌తో కుంప‌టి రాజుకుంది. అది ఎప్ప‌టికీ ఆర‌ని చిచ్చులా ర‌గులుతూనే ఉంది. భారీ సినిమాలు తీయ‌డంలో ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ల విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. వంద‌ల కోట్ల పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లుతూ భారీ పాన్ ఇండియా సినిమాల‌ను తెర‌కెక్కించి బ‌హుభాషల్లో రిలీజ్ చేసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

అదేకోవ‌లో వ‌స్తున్న RRR సంచ‌ల‌నాలు న‌మోదు చేయ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా ఏర్పడింది. ఇప్ప‌టికే చిత్ర‌బృందం దోస్తీ సాంగ్ తో ప్ర‌చారాన్ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఇక‌పైనా ప్ర‌చారంలో హంగామా కొనసాగ‌నుంది. అక్టోబ‌ర్ 13న ద‌స‌రా కానుక‌గా ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేసేందుకు జ‌క్క‌న్న శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ స‌మ‌యంలో మ‌రో చిత్రం పోటీప‌డాలంటే గ‌ట్స్ ఉండాలి. అలాంటి గ‌ట్స్ ఎవ‌రికి ఉన్నాయి? అంటే ఇన్నాళ్లు స‌రైన ఆన్స‌ర్ లేదు. ఈసారి ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా మ‌రో పాన్ ఇండియా చిత్రం బ‌రిలో దిగ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ ని టార్గెట్ పెట్టుకుని ఐకాన్ స్టార్ బ‌న్ని బ‌రిలో దిగిపోతున్నాడ‌నేది ఫిలింన‌గ‌ర్ గుస‌గుస‌...!

గతంలో మ‌హేశ్ ని టార్గెట్ పెట్టుకుని ఎలాగైనా `అల‌వైకుంఠ‌పురములో` సినిమాని `స‌రిలేరునీకెవ్వ‌రు`ని మించి హిట్ చేయాల‌ని ట్రై చేసిన బ‌న్నీ ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యాడు. 2020 సంక్రాంతి బాక్సాఫీస్ వ‌ద్ద బన్ని సిస‌లైన‌ విన్న‌ర్ గా నిలిచాడు. ఇప్పుడు ఐక‌న్ స్టార్ అంత‌కుమించి అంటున్నాడు. అస‌లు తగ్గేదేలే అంటూ పుష్ప చిత్రాన్ని ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా దించేందుకు టార్గెట్ పెట్టుకున్నాడ‌ట‌. వ‌స్తే కొండ లేక‌పోతే వెంట్రుక మాదిరి ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ ఆలోచిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఆస‌క్తిక‌రంగా ఆర్.ఆర్.ఆర్ అంత భారీ చిత్రం కాక‌పోయినా కానీ పుష్ప కూడా పాన్ ఇండియా కేట‌గిరీ చిత్ర‌మే. ఈ సినిమాని తెలుగు-త‌మిళం-హిందీ-మళ‌యాలం మార్కెట్ల‌ను టార్గెట్ చేసుకుని అత్యంత భారీగా రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే పుష్ప భారీ బిజినెస్ పూర్తి చేస్తోంద‌ని టాక్ ఉంది. త‌గ్గేదేలే అంటూ దిగిపోయినా బాక్సాఫీస్ వ‌ద్ద ఆర్.ఆర్.ఆర్ ని ఢీకొట్ట‌డం అంటే సాహ‌స‌మే. కానీ త‌మ‌కు ఆ గ‌ట్స్ ఉన్నాయ‌ని బ‌న్ని - సుక్కూ టీమ్ బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టే కనిపిస్తోంది. ప్ర‌స్తుతం థ‌ర్డ్ వేవ్ ముప్పు గురించి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో గ‌ట్సీగా రిలీజ్ ల‌కు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ నాటికి మ‌హ‌మ్మారీని అదుపులోకి తేగ‌లిగితే సినిమాల‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.


Tags:    

Similar News