డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా స్టార్ట్ అయిన తర్వాత సినిమాల ఫిలిం మేకర్స్ కొత్త ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఒరిజినల్ మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ లను కూడా తెరకెక్కిస్తూ విప్లవాత్మక మార్పులకు కారణం అవుతున్నారు. అయితే బాలీవుడ్ తో పోల్చుకుంటే సౌత్ ఇండస్ట్రీలో డిజిటల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా సౌత్ ఫిలిం మేకర్స్ కూడా డిజిటల్ కంటెంట్ వైపు మళ్లించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో నలుగురు ఐదుగురు దర్శకులు కలిసి ఓ ఆంథాలజీ సిరీస్ ని తెరకెక్కిస్తున్నట్లే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'పుతం పుదు కలై' అనే ఆంథాలజీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
తమిళ్ లో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ కి 5గురు స్టార్ డైరెక్టర్లు దర్శకత్వం వహించడం విశేషం. గౌతమ్ వాసుదేవ్ మీనన్ - కార్తీక్ సుబ్బరాజు - రాజీవ్ మీనన్ - సుధ కొంగర - సుహాసిని మణిరత్నం కలిసి 5 స్టోరీల ఈ ఆంథాలజీని డైరెక్ట్ చేశారు. ప్రేమ - కొత్త ప్రారంభాలు - సెకండ్ ఛాన్స్ - ఆశ నేపథ్యంలో తెరకెక్కాయి. కరోనా లాక్ డౌన్ లో ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ ట్రైలర్ ఓ ఫోన్ కాల్ తో ప్రారంభమవుతుంది. ఫోన్ చేసిన వ్యక్తి ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించినట్లు చెప్తాడు. లాక్ డౌన్ లో ఈ ఐదు డిఫరెంట్ కథలు జరిగినట్లుగా చూపించారు.
ఈ వెబ్ సిరీస్ లో బాబీ సింహా - జయరాం - శృతి హాసన్ - ఆండ్రియా - కళ్యాణి ప్రియదర్శన్ - రీతూ వర్మ - సుహాసిని మణిరత్నం - అను హాసన్ - ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ని మణిరత్నం - సుహాసిని మణిరత్నం - రాజీవ్ మీనన్ - కార్తీక్ సుబ్బరాజ్ - ఫ్రాన్సిస్ థామస్ - శ్రుతి రామచంద్రన్ - ఆదిత్య కేఆర్ - రేష్మా ఘటాలా - కృష్ణస్వామి రామ్ కుమార్ రచించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. మీనాక్షి సినిమాస్ - లయన్ టూత్ స్టూడియోస్ - మద్రాస్ టాకీస్ - రాజీవ్ మీనన్ ప్రొడక్షన్స్ - స్టోన్ బెంచ్ నిర్మాణ సంస్థలు నిర్మించాయి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'పుతం పుదు కాలై' అక్టోబర్ 16న విడుదల కానుంది. సౌత్ ఇండస్ట్రీలోనే తొలిసారిగా వస్తున్న ఈ ప్రయోగాత్మక ఫిల్మ్ ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.
Full View