వంశీకి పీవీపీ స్ట్రోక్ మామూలుగా లేదు

Update: 2016-12-30 14:06 GMT
పీవీవీ బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మొదటి మూవీ ఊపిరి. ఈ ఏడాది మార్చ్ లో రిలీజ్ అయిన చిత్రానికి బోలెడన్ని ప్రశంసలు వచ్చాయి. వసూళ్లు కూడా పర్లేదనే అనిపించాయి. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో పీవీపీ బ్యానర్ లోనే కొత్త సినిమా అనౌన్స్ అయింది.

మహేష్ బర్త్ డే సందర్భంగా కంబైన్డ్ గా బర్త్ డే విషెస్ యాడ్ ఇచ్చి ఈ విషయాన్ని ధృవీకరించారు వంశీ-పీవీపీ. కానీ ఇప్పుడు కథలో ట్విస్ట్ వచ్చింది. మహేష్ బాబుతో సినిమాను దిల్ రాజు-అశ్వనీదత్ లు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పేశాడు వంశీ పైడిపల్లి. దీంతో పీవీపీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి.. ఏకంగా పీవీపీ బ్యానర్ కోసం సిద్ధం చేసిన సినిమా స్టోరీని ఎక్కడా ఉపయోగించరాందంటూ  ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. దీని ప్రకారం వంశీ పైడిపల్లి.. అతని సహ రచయితలు హరికృష్ణ.. సాల్మన్ లు ఈ స్టోరీ ఉపయోగించుకునే వీలు లేకుండా పోయింది.

పీవీపీ ఇక్కడితో ఆగకుండా ఫిలింఛాంబర్ లో ఊపిరితో వచ్చిన నష్టాలపై కూడా కంప్లెయింట్ చేసి.. తనకు ఊపిరితో 21 కోట్లు నష్టం వచ్చిందని.. వాటిని వంశీ పైడిపల్లి నుంచి ఇప్పించాలన్నారు. ఇప్పటివరకూ పైడిపల్లి వంశీ దీనిపై స్పందించలేదు కానీ.. పీవీపీ ఇచ్చిన డబుల్ స్ట్రోక్ నుంచి ఎలా బైట పడతాడనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News