వార్నీ.. అంత గొడవ పడ్డారు కదండీ!!

Update: 2017-02-15 06:23 GMT

సినిమా ఇండస్ర్టీలో ఏ స్నేహం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. ఏ రిలేషన్ ఎలాంటి తలుపులు తడుతుందో.. ఏది ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ స్టార్డమ్ నుండి స్నేహం వరకు.. ఏదీ శాశ్వతం కాదు. అలాగే కోపం నుండి గొడవలు వరకు కూడా శాశ్వతం కాదు. ఇదిగో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం.

మొన్ననే వంశీ పైడిపల్లి తనని నిలువునా ముంచేశాడు అంటూ నిర్మాత పివిపి కోర్టులో ఒక కేసు.. నిర్మాతల మండలిలో ఒక కేసు పెట్టాడు. కోర్టులోనేమో మహేష్‌ బాబుతో చేయాల్సిన సినిమా వేరే నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాడు వంశీ అంటూ పివిపి ఆరోపిస్తే.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఊపిరి సినిమా ద్వారా వంశీ పైడిపల్లి లేజీ మేకింగ్ వలన 20 కోట్ల లాస్ వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ''ఘాజీ'' సినిమాతో వస్తున్న పివిపి.. ఆ సినిమా ప్రీమియర్ షో ఈవెంటుకు వంశీని కూడా ఇన్వయిట్ చేశాడు. అక్కడ ఇద్దరూ కలసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కూడా. అసలు అంతలా గొడవ పడిన ఈ ఇద్దరేనా ఇలా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది అని అనిపించకమానదు.

ఏదేమైనా కూడా.. సినిమా వాళ్లందరూ కొట్టుకోకుండా కలసి మెలసి ఉంటే బాగుంటుంది. బహుశా పివిపి అండ్ వంశీ మధ్యన వచ్చిన అవాంతరాలు అపోహలు అన్నీ తొలిగిపోయాయ్ అనుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News