మహేష్ బాబు 25వ సినిమాగా రూపొందుతున్న రిషి(ప్రచారంలో ఉన్న టైటిల్)మీద ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ రేపు పుట్టిన రోజు సందర్భంగా టీమ్ ఏ కానుక ఇస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టైటిల్ విషయంలో రిషి అంటూ గట్టి ప్రచారమే జరుగుతుండగా ఈ సస్పెన్స్ కు రేపు అఫీషియల్ గా తెరపడిపోతుంది. ఇక దీనికి ముగ్గురు నిర్మాతలు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించే సామర్ధ్యం విడివిడిగా ఈ ముగ్గురికీ ఉన్నా మహేష్ కున్న కమిట్మెంట్స్ దృష్ట్యా కలవక తప్పలేదు. అశ్విని దత్-దిల్ రాజు-పివిపి సంస్థ జాయింట్ వెంచర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎవరి వాటా ఎంత అనే దాని గురించి కొన్ని అనుమానాలు లేకపోలేదు. పివిపి షూటింగ్ మొదలుపెట్టడానికి కొద్దిరోజుల ముందు జాయిన్ అయ్యింది కాబట్టి తక్కువ షేర్ ఉండొచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు ముగ్గురికి ఇందులో సమాన హక్కులు ఉంటాయి. అంటే పెట్టుబడి పెట్టడం దగ్గర నుంచి లాభం వచ్చినా నష్టం వచ్చినా అందరూ ఒకేలా పంచుకునే విధంగా అగ్రిమెంట్ జరిగిందట. కాకపోతే దిల్ రాజు పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుందని తెలిసింది. ఊపిరి సమయంలో చేసుకున్న పివిపితో చేసుకున్న ఒప్పందంలో భాగంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మరో రెండు సినిమాలు అదే బ్యానర్ లో చేయబోతున్నట్టు టాక్. ఈ షేర్ల గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు కనక టాక్ ప్రకారం చూస్తే నిజమే అని తెలిసింది. ఏప్రిల్ 5న దసరా పండగ సందర్భంగా విడుదల కానున్న ఈ మూవీ భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండటంతో ట్రేడ్ కూడా ఇప్పటి నుంచే పెట్టుబడికి ఆసక్తి చూపుతోంది. ఏరియాల వారీగా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఇంకొంత కాలం అయ్యాక డీల్స్ మాట్లాడాలని ముగ్గురు నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.