కంగనా రనౌత్ తన గూఢచర్యం ముగించి ఇప్పుడిలా ప్రత్యక్షమైంది. యాక్షన్ థ్రిల్లర్ ధాకాడ్ .. తలైవి చిత్రాలను పూర్తి చేసి ఇప్పుడు సాధ్యమైనంత ఎక్కువ రిలాక్స్ డ్ గా సమయాన్ని స్పెండ్ చేస్తోంది. ఇంతకుముందే బుడాపెస్ట్ లో చిత్రీకరణ ముగించి అక్కడ ఇలా తనకు కుమారుడి వరుస అయ్యే చిన్నారితో తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఆమె తన కుటుంబంతో సెలవు తీసుకుంది. కొన్ని చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఆమె తన సోదరి రంగోలి చండెల్ కుమారుడు పృథ్వీరాజ్ తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈతకు సిద్ధమవుతుండగా కెమెరా క్లిక్ మనిపించింది. కంగన బ్లాక్ మోనోకిని ధరించి పెద్ద గడ్డి టోపీ కూడా ధరించింది.
ఒక ఫోటోలో కంగనా తల్లి ఆషా రనౌత్ పూల సల్వార్ కమీజ్ ధరించి ఉన్నారు. బుడాపెస్ట్ లోని స్థానికులకు ఇది రొటీన్ సంస్కృతి అంటూ కంగన చమత్కరించారు. ``బికినీలు ధరించినప్పుడు ఉత్తర భారతదేశంలో తెల్లని స్త్రీలను ఎలా చూస్తారో కానీ.. ప్రజలు తల్లిని చూసినట్టు భావించాలి`` అని వ్యాఖ్యను జోడించారు కంగన.
రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ధాకాడ్ చిత్రంలో అర్జున్ రాంపాల్ - దివ్య దత్తా కూడా నటించారు. ఈ చిత్రం తన కెరీర్ లో బెంచ్ మార్క్ గా ఉండటమే కాకుండా ఇండియన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని కంగనా గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని ప్రతిష్టాత్మకమైన ఒక రకమైన మహిళా నేతృత్వంలోని యాక్షన్ ఫిల్మ్ అని వెల్లడించింది. దీనికి మంచి ఆదరణ లభిస్తే భారతీయ చిత్రసీమలో మహిళా తారలు వెనుదిరిగి చూసుకోవడం ఉండదు” అని ఆమె అన్నారు.
తలైవిలోనూ కంగన టైటిల్ పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.., దివంగత జె జయలలిత పాత్రను పోషించారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సినిమా నిరవధికంగా ఆలస్యం అయింది. ఇంతకుముందు.. డిజిటల్ లో నేరుగా విడుదల చేస్తారనే పుకార్లు వచ్చాయి. కానీ ఆమె దానిని తప్పుడు ప్రచారం అని తోసిపుచ్చింది.
తలైవి డిజిటల్ హక్కులు అమెజాన్ (తమిళ్) .. నెట్‌ఫ్లిక్స్ (హిందీ) తో ఉన్నాయి. వాటిలో ఏవీ థియేటర్ లలో విడుదలకు ముందు సినిమాను ప్రసారం చేయలేవు. ఈ ప్రచారమంతా నకిలీ ప్రచార మూవీ మాఫియా చేస్తోంది! అంటూ కంగన అన్నారు. తలైవి థియేట్రికల్ విడుదలకు అర్హమైనది .మేకర్స్ అదే నిశ్చయించుకున్నారు. నకిలీ ప్రచారాన్ని వ్యాప్తి చేసే ఏదైనా బికారి మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని కంగన ఘాటైన వ్యాఖ్యను చేశారు.