ఇలాంటి క్రిటిక్స్ ఎక్కడి నుంచి వస్తారో?

Update: 2016-04-08 09:32 GMT
రివ్యూలు రైటర్స్ - క్రిటిక్స్ పై టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆర్. బాల్కి.. క్రిటిక్స్ పై డైరెక్టుగానే విరుచుకుపడ్డాడు. రీసెంట్ గా ఈయన డైరెక్షన్ లో వచ్చిన కి అండ్ క చిత్రాన్ని క్రిటిక్స్ తీవ్రంగా విమర్శిస్తే.. ప్రేక్షకుల నుంచి మాత్రం సూపర్బ్ గా ఆదరణ దక్కింది. సాధారణ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే 35 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

'తాము దేన్నైనా విమర్శించచ్చు అనకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. కామన్ ఆడియన్స్ కోసం కాకుండా.. బెర్లిని ఫిలిం ఫెస్టివల్ కోసం రివ్యూ రాస్తున్నామని అనుకుంటూ ఉంటారు. అసలు ఇలాంటి వాళ్లు ఎక్కడి నుంచి వస్తారో? ఓ ఆకు.. పై నుంచి కింద పడే సీన్ ని ముప్పావుగంట పాటు చూపిస్తే.. అబ్బో సూపర్ అనే బాపతు వీళ్లంతా' అంటూ విరుచుకుపడ్డాడు బాల్కి.

'నేనిక్కడకి ఆడియన్స్ కోసం సినిమాలు తీసేందుకు వచ్చాను. క్రిటిక్స్ ని మెప్పించడానికి కాదు. వీళ్లను మెప్పించడమంటే నేను దివాలా తీయడమే. వీళ్ల విమర్శల్లో కొన్ని కరెక్టే కావచ్చు కానీ.. చాలా వరకు తప్పులే' అని తేల్చేశాడు ఆర్ బాల్కి. ఈ దర్శకుడి వాదనలోనూ వాస్తవం ఉందనే మాటలు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News