బాహుబలి సీక్వెల్ లో కొత్త ట్విస్ట్

Update: 2015-10-28 15:33 GMT
విజువల్ ఎఫెక్ట్స్ ని కనుల విందుగా చూపించి, సినిమాని ఏ స్థాయి హిట్ చేయచ్చో చూపించిన సినిమాలు హాలీవుడ్, బాలీవుడ్ లలో చాలానే ఉన్నాయి. వీటికి ఏ మాత్రం తీసిపోకుండా హిట్ కొట్టింది టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తీసిన బాహుబలి. 600కోట్లకు పైగా కలెక్షన్లను ఓ తెలుగు సినిమా కలెక్ట్ చేసిందంటే.. దానికి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన కారణమని ఒప్పుకోవాల్సిందే.

బాహుబలి ది బిగినింగ్ కు వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించాడు శ్రీనివాస్ మోహన్. మాహిష్మతి సామ్రాజ్యాన్ని- భీకర యుద్ధాన్ని హృద్యంగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యాడు శ్రీనివాస్. ఇప్పుడీయన బాహుబలి టీంకి గుడ్ బై చెప్పేశాడు. తన గురువు - మార్గదర్శకుడు అయిన డైరెక్టర్ శంకర్ తీస్తున్న రోబో-2  కోసం బాహుబలి నుంచి వైదొలగాడు.

ఈ విషయాన్ని బాహుబలి యూనిట్ స్వయంగానే ప్రకటించింది. ఆర్ సీ కమల్ కన్నన్ ను వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ.. యూనిట్ ట్వీట్ చేసింది. రెండుసార్లు నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన కమన్ కన్నన్.. బాహుబలి ది కంక్లూజన్ కు వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరిస్తారని తెలిపింది యూనిట్. ట్విస్ట్ బాగానే ఉంది కానీ.. ఇలాంటి కంటిన్యుటీ ఉండాల్సిన సినిమాలకు యూనిట్ కూడా ఒకటే ఉండేలా జాగ్రత్తపడతారు. కానీ ఇక్కడ ఛేంజ్ ఫిక్స్ అయిపోయింది. అంటే బాహుబలి ది కంక్లూజన్ కి విజువల్ ఛేంజ్ కూడా తప్పదన్నమాట.
Tags:    

Similar News