దాసరిని ఇరుకున పెట్టేసిన మూర్తిగారు

Update: 2017-01-07 10:31 GMT
చిన్న సినిమాల సంక్షేమం గురించే ఎప్పుడూ మాట్లాడుతుంటారు దర్శకరత్న దాసరి నారాయణరావు. మొన్న కూడా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా ప్రమోషన్ కోసం ముందుకొచ్చారు. ఆ సినిమా గురించి మంచి మాటలు చెప్పారు. చిన్న సినిమాను బతికిస్తేనే పరిశ్రమ బతుకుతుందన్నారు. కానీ ఇప్పుడు దాసరి శిష్యుడైన ఆర్.నారాయణమూర్తి కథానాయకుడిగా నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామంటే థియేటర్లు దొరకట్లేదు. దీని గురించి ప్రెస్ మీట్లో ఏడ్చినంత పని చేశారు నారాయణమూర్తి. పరిస్థితి చూస్తే ఏడుపొస్తోందన్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలతోనే థియేటర్లను నింపేయడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు.

నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే దాసరి నారాయణరావు ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నారు. ఏ పెద్ద సినిమాల వల్లయితే అన్యాయం జరుగుతోందని నారాయణమూర్తి ఆరోపించాడో ఆ పెద్ద సినిమాల్లో ఒకదాని వేడుకకు ఆయన గురువు దాసరి హాజరవుతున్నారు. మరి చిరంజీవి సినిమా భారీగా థియేటర్లు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోందని.. కాబట్టి థియేటర్లు తగ్గించుకుని నారాయణ మూర్తి సినిమా విడుదలకు సహకరించాలని దాసరి అనగలడా? ఎప్పట్లాగే పెద్ద సినిమాల నిర్మాతలపై ధ్వజమెత్తుతూ చిన్న సినిమాను బతికించే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించగలడా? చిరు బృందాన్ని ప్రశ్నించగలడా..? సందేహమే. మొత్తానికి దాసరి శిష్యుడు ఆయనకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News